ప్రధాని పర్యటిస్తున్న నగరంలో ప్రధానినే అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే ఇంత వరకు ఒక్క చర్యలేదు. కేంద్రం చర్యలు తీసుకుంటున్నదిలేదు. ఇంతకీ ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగా అని ప్రజలు ఆశ్చర్యపోతున్న విషయం.
ఈ దేశ ప్రధానుల్లో ఎవరినీ ఇంతగా అవమానపరుస్తూ పోస్టర్లు పెట్టిన సంఘటన నేను ఎప్పుడూ చూడలేదు.
ఈ దేశ ప్రధాని ఎవరైనా సరే.. ఆయనపై విధాన పరంగా విమర్శ చేయొచ్చు. కానీ ఫ్లెక్సీలపై అడ్డగోలు విమర్శలతో అవమానించడాన్ని నిజంగా నేను భరించలేపోతున్నాను. ప్రధానిని ఇంతగా అవమానించడం పరోక్షంగా దేశానికి అవమానమే.
నేను నా దేశాన్ని గౌరవిస్తాను. , నా దేశ ప్రధాని ఎవరైనా సరే గౌరవిస్తాను.

Kalluri Srinivasa Reddy