కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు..

మీరు బిజెపి లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మీరు ఎందుకు టీఆరెఎస్ కెల్లి ఎల్లిపోయి కాంగ్రెస్ ల చేరినరో ఆ ఉద్దేశ్యం మీతో కలిసి పనిచేసిన నాకు తెలుసు.. తెరాస లో దొరకని స్వాతంత్య్రం, స్వేచ్చ, ఆత్మగౌరవం బిజెపి లో దొరుకుతుంది అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.. కాంగ్రెస్ లో కాస్తో కూస్తో గళం వినిపించారు.. బిజెపి లో మాట్లాడడానికి ఏమి ఉండదు.. దేశం, ధర్మం తప్ప.. అది దాటి మాట్లాడాలంటే మీరు వార్తల్లో ఉండరు.. ఈటెల కు అంతకు మించి గౌరవం ఏముంది బిజెపిలో? మీ పరిస్థితి కూడా అంతే..

మీ భావజాలం, మీ విషయ పరిజ్ఞానం బిజెపికి అసలు సరిపోదు.. కానీ ఎందుకు వెళ్తున్నారనేది మల్లోసారి నిర్ణయం తీసుకోండి.. మీ ఆస్తుల కోసమో, అదానీ బారి నుండి మీ వియ్యంపుడు GVK ఆస్తులను కాపాడుకోవడానికి చేరితే అయితే మాత్రం రాజకీయ సమాధి చేసుకున్నట్టే.. తిరిగి తెరాస లో చేరినా, కాంగ్రెస్ లోనే ఉన్నా, లేదు అంటే కొత్త పార్టీ పెట్టి కోదండరాం సార్ లాంటి వాళ్ళను కలుపుకుపోయినా బాగుండేది.. తెలంగాణలో రాజకీయ చైతన్యం రావలసిన అవసరముంది.. బిజెపి వస్తే మాత్రం రాజకీయ శూన్యం ఏర్పడుతుంది.. దయచేసి ఆలోచించుకోండి..

Akhilesh Kasani