ఎంపీ అరవింద్ ఖబర్దార్…

సి పి నాగరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి…

అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం…

దళిత సంఘాల డిమాండ్…

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఈ నెల 24న పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ కాన్వాయ్పై రైతులు దాడి చేశారు. అయితే ఈ సంఘటన సాకుగా చూపి దళితుడైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పర్యవేక్షణ లోపం వల్లే తనపై దాడి జరిగిందన్నారు. కమిషన్ వా.? కానిస్టేబుల్ వా? అంటు కించపరిచేలా మాట్లడటాన్ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంతా) మరియు తెలంగాణ మాల మహానాడు, మాల మహానాడు, దళిత సంఘాల నాయకులు ఖండించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని 4 టౌన్ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ మనువాద బిజెపి పార్టీ నుంచి ఎంపీ గెలిచిన అరవింద్ అగ్రకుల అహంకారాన్ని దళిత అధికారులపై చూపిస్తున్నాడని అన్నారు. ఇటీవల క్యూ న్యూస్ వ్యవహారంలో స్పందించిన అరవింద్ అట్రాసిటీ కేసు ను “లోట్టపిస్ కేసు”అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సాక్షిగా దళితులకు అండగా అట్రాసిటి చట్టం నిర్మితమైందని, అలాంటి చట్టాన్ని అవమానించిన అరవింద్ కి తగిన గుణపాఠం చెబుతామన్నారు.

దళిత ఉద్యోగుల పట్ల దళిత అధికారుల పట్ల ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ సిపి నాగరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇక మీదట ఇలాంటి ప్రవర్తన లో అనుచిత వ్యాఖ్యలకు దిగితే దళితుల నుంచి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జైపాల్, రాష్ట్ర నాయకులు బాల్ రాజు, మాల మహానాడు జిల్లా ఇంచార్జీ పాశం కుమార్, సమత లాయర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు గోర్కంటి లింగన్న, దళిత జర్నలిస్టు ఫోరమ్ జిల్లా కో కన్వీనర్ ఏడ్ల సంజీవ్, సుభాష్ వాగ్నర్, మాల యూత్ కన్వీనర్ అనుపాల్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.