కొప్పుల ఈశ్వర్. ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖకు మంత్రి. ఓ బాధ్యతగల పదవిలో ఉండీ ఏకంగా మాజీ ప్రధాని చనిపోకముందే .. ఆయన మృతి చెందారంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పీఆర్వో దామోదర్ ఇలా ప్రెస్‌నోట్ రెడీ చేసి పంపాడు మీడియాకు.
దయచేసి స్క్రోలింగ్ పెట్టగలరు
—————————————-
దయచేసి ప్రచురించగలరు
—————————————-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి కొప్పులఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు
👉 మన్మోహన్ సింగ్ అకాల మరణం తీవ్ర విచారకరం, బాధాకరం-మంత్రి కొప్పుల ఈశ్వర్
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం-మంత్రి కొప్పుల ఈశ్వర్
👉ఆయన మృతితో దేశం ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తను,పాలనాదక్షుడిని కోల్పోయింది,ఆయన మృతి భారత జాతికి తీరని లోటు -మంత్రి కొప్పుల ఈశ్వర్
దివంగత నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్న,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెల్పుతున్న-మంత్రి కొప్పుల ఈశ్వర్
………………………………………………………………………
అనారోగ్యంతో మన్మోహన్ సింగ్ మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కొనసాగుతున్నది. కానీ మన మంత్రి పీఆర్వో ముందే ఆయన్ను చంపేశాడు. మృతి చెందాడంటూ ఓ ప్రెస్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నాడు. గతంలో ఇలాంటికి తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏకంగా మంత్రి పీఆర్వో అత్యుత్సాహం.. సమాచార లోపం మంత్రిని నవ్వుల పాలు చేసేలా అయ్యింది. మంత్రి పూర్తిగా పీఆర్వోను గుడ్డిగా నమ్మినట్టున్నాడు. కనీసం వాస్తవమేందో తెలుసుకోవాలన్న సోయి ఇద్దరికీ లేదు. ప్రెస్ నోట్ రిలీజ్ కాగానే తప్పు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఫోన్ల మీద ఫోన్లు. చివాట్ల మీద చివాట్లు…తిట్ల మీద తిట్లు పడేసరికి దాన్ని గ్రూపులను నుంచి డిలేట్ చేశాడు. ఓ మైనార్టీ ఆఫీసర్ దయచేసి దీన్ని ప్రచురించొద్దు అని వేడుకుంటూ అదే గ్రూపులో మెసేజ్ పెట్టి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా.. అప్పటికే ఇది ఆనోటా ఈనోటా అందరికీ చేరి చర్చకు దారి తీసింది.