(దండుగుల శ్రీ‌నివాస్‌)

మొన్న రేవంత్ మాట్లాడుతూ ఓ మాట‌న్నారు. నెల‌కు 5 కోట్లు కేటీఆర్ సోష‌ల్ మీడియాకు ఖ‌ర్చు పెడుతున్నార‌ని. మ‌రి ఆ పెట్టిన ఖ‌ర్చు ఉత్త‌గ‌నే పోత‌దా? ఇగో ఇవాళ క‌నిపించింది ఆ క‌వితావేశం. అసెంబ్లీలో కేటీఆర్ ఓ చిట్టా రాసుకొచ్చాడు. తీసి చ‌దివాడు త‌న అల‌వాటుకు భిన్నంగా. మ‌రి ఎంత‌కాలం శ్ర‌మించి క‌ష్టించి ఏర్చి కూర్చి ఆ ప‌దాల‌ను చేర్చి య‌తి ప్రాస‌ల‌ను జోడించి.. రాసిచ్చారో గానీ.. మంచి క‌వితావేశం తాండ‌వం చేసిందనే చెప్పాలి. కేటీఆర్ సోష‌ల్ మీడియా త‌మ మెద‌ళ్ల‌ను కొంచెం కొంచెంగా క‌రిగిస్తున్న‌ద‌న్న‌మాట‌. అందుకే కేటీఆర్ ఎంత బ‌ట్టీప‌డదామ‌న్నా వీలు కాన‌ట్టుంది. క‌ళ్ల‌జోడు పెట్టుకుని మ‌రీ చ‌ద‌వేశాడు ఆ య‌తి ప్రాస‌లు ప్ర‌యాప ప‌డుతూ. నిజం చెప్పొద్దూ… అవి నిజంగానే విన‌సొంపుగా ఉన్నాయి. అందులో నిజాలూ లేక‌పోలేదు. అందుకే కొంచెం ఆ య‌తి ప్రాస‌ల ప్ర‌సంగం విన్నారు. కేటీఆర్ టీమ్ రాసిన క‌వితావేశంలోని కొన్ని ప‌దాలు ఇలా. ఉన్నాయి. ఒక్క‌సారి ఓ లుక్కిచ్చుకోండి.

ఎగ్గొట్టు..కూలగొట్టు..చెడగొట్టు!, ఏమున్నది చెప్పుకోవడానికి 28 నెలల్లో..! బాకీలు…బకాయిలు ! డైవర్షన్లు..కమీషన్లు! బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు…ఆల్‌టైం రికార్డు అప్పులు..క్యూలైన్లలో చెప్పులు! 420 ఎగనామాలు..మూడున్నర కోట్ల మందికి పంగనామాలు! ఇలా సాగింది కేటీఆర్ స్పీచు.. ప‌ద్యాల‌తో మొద‌లు పెట్టి ప్రాస‌ల‌తో సాగ‌దీసి.. అందులో ఆరోప‌ణ‌ల‌ను జొప్పించి.. అబ‌ద్దాల‌నూ రంగ‌రించి.. అది రాయ‌డానికి క‌వి పుంగ‌వులు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో.. అంత‌కు మించి అది చూసి చ‌ద‌వ‌డానికి కూడా కేటీఆర్ క‌ష్ట‌ప‌డ్డాడు. స్కాములు కళకళ..స్కీములు వెలవెల…రైతన్నలకు బేడీలు..నిరుద్యోగుపై లాఠీలు..ఫిరాయింపులు కంపు..బస్సు చార్జీల వాయింపు…ఫుడ్ పాయిజన్ చావులు..ఫుట్ బాల్ సరదాలు… ఇలా ఇలా సాగిపోతూనే ఉంది. మ‌రి అధికార పార్టే అన్న‌ది. బీఆరెస్ సోష‌ల్ మీడియాకు కేటీఆర్ నెల‌కు 5 కోట్లు పెడుతున్నాడ‌ని. అందుకే ఇలా కాంగ్రెస్ పై క‌చ్చ తీర్చుకున్నారు. మ‌రి కాంగ్రెస్ కూడా ఇలాంటి క‌వితావేశం ఇంపుగా ఉన్న క‌విపుంగ‌వులను ఏర్పాటు చేసుకోవ‌చ్చుగా. చేసుకోవాలి కూడా త‌ప్ప‌దు. ఏ మాకెందుకు? అని లైట్ తీసుకోకండి… ఇప్పుడంతా సోష‌ల్ మీడియా యుగ‌మే. కాదంటారా?

Dandugula Srinivas

7661066999