త‌ప్పిదారి మేం గెలిస్తే…!? రామ‌న్న మాట‌ల్లో ఆంత‌ర్య‌మేమిటో..!? అంటే గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని ఒప్పుకోవ‌డ‌మా? ఒక‌వేళ గెలిస్తే మిమ్మ‌ల్ని వ‌ద‌ల‌బోమ‌నే బెదిరింపులా? ఒక‌వేళ మేం గెలిస్తే.. అంటే.. ఆ గెలుపు ఆశ‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయ‌ని ఒప్పుకున్న‌ట్టా? గెల‌వ‌డం క‌ష్ట‌మే కానీ… గెలిస్తే మాత్రం ప‌గ‌లు, ప్ర‌తీకారాల‌కే పరిమిత‌మ‌వుతార‌ని చెప్పుకోవ‌డ‌మా? మీరు ప్ర‌తీకారాలు తీర్చుకునేందుకు మిమ్మ‌ల్ని గెలిపించాలా ప్ర‌జ‌లు.. హుందాత‌నం వీడి.. గ‌ల్లీ లీడ‌ర్‌గా మారిపోయిన కేటీఆర్‌.. కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను ఎవ‌రో కాదు.. కొడుకే తుడిచేసేలా ఉన్నాడు.. జ‌నం ఇదే అనుకుంటున్నారు..! జ‌ర వెన‌కాముందు చూస్కోండ్రీ… ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల కోసం పోరాడండి.. బాల‌య్య‌బాబు సినిమా డైలాగులు కాదు మీ నుంచి జ‌నం కోరుకునేది!

(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప్ర‌చారంలో ప‌ద‌నిస‌లు కామ‌నే. కానీ కేటీఆర్ మాట్లాడే మాట‌లే ఇప్పుడు చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి. అధికారం పోయింద‌నే ఫ్ర‌ష్టేష‌న్ ఉంటుంది కామ‌నే. కానీ అది జీవితం మీద విర‌క్తి పుట్టి.. కంట్రోల్ త‌ప్పి.. సోయి మ‌రిచి.. హుందాత‌నం విడిచి.. పాతాళంలోకి దిగ‌జారి.. ఏది ప‌డితే అది మాట్లాడేస్తున్నాడు కేటీఆర్‌. అదిప్పుడు ఆ పార్టీ నేత‌లే ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. మొన్న‌టికి మొన్న.. కేసీఆర్ ఎవ‌రిని నిల‌బెడితే వారికి ఓటేయ్యాలంతే.. అన్న‌డు. వాళ్లు ఎట్లాంటోళ్లో మీకు సంబంధం లేదు.. అది కేసీఆర్ ఇష్టం అని శాసించాడు. అట్ల చేసే .. ఇచ్చినోడికి ఇచ్చీ ఇచ్చీ పార్టీని చంక‌నాకిచ్చిండు కేసీఆర్‌. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చేస్తుండు.

ఇక నిన్న కారు గుర్తు త‌ప్ప వేరే గుర్తు చూస్తే మీ క‌ళ్లు పోతాయ‌ని శ‌పించి, బెదిరించే కాడికి వ‌చ్చిండు. ఇక తాజాగా రేవంత్ రెడ్డినుద్దేశించి… పొట్టోడా.. మొక్కుకో.. మంచిగా, గ‌ట్టిగా మొక్కుకో.. త‌ప్పిదారి మ‌ళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. నీకుంటుంది చూడు.. ! అని బెదిరించే ప్ర‌య‌త్నం చేశాడు. స‌రే, ఈ బెదిరింపులు ప‌క్క‌నపెడదాం.. కాసేపు. త‌ప్పిదారి అంటే ఏందీ కేటీఆర్‌..! అంటే మీరు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారనే ఆశ‌లు ద‌రిదాపుల్లో కూడా మీకు లేదా? ఒక‌వేళ వ‌స్తే.. వ‌చ్చిందంటే అది త‌ప్పిదారే అన్న‌ట్టు.. అంతేనా! బెదిరింపు రాజ‌కీయాలు అల‌వాటైపోయి.. ఆ బెదిరింపు మాట‌ల‌తో పాటు మ‌న‌సులో ఉన్న నిజం మాట‌ల‌ను కూడా బ‌య‌ట‌కే అనేస్తున్న‌ట్టున్నాడు కేటీఆర్‌.

జ‌నం ఎటువైపున్నారో.. వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో.. గ‌తంలో మీరు చేసిన పాపాలు, లోపాలు, త‌ప్పిదాలేమిటో..! ఇవి క‌దా మీరు తెలుసుకుని, మ‌స‌లుకోవాల్సింది. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యమే ఉంది. అప్ప‌టి దాకా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుక చూడండ్రా అంటే.. ఇగ మేమొస్తే.. ఇగ వ‌స్తం.. ఇగో వ‌స్తున్నాం.. తెల్లారి లేస్తే అధికారం కోసం క‌ల‌వ‌రిచ్చుడే త‌ప్ప‌..జ‌నం గోడు ప‌ట్ట‌దాయే. వారి నాడి తెలుసుకునే ప్ర‌య‌త్న‌మే ఇంకా జ‌ర‌గ‌క‌పాయె. ఇక మిమ్మ‌ల్ని న‌మ్ముత‌ర ఇంకా. మ‌రి న‌మ్మ‌డం లేద‌నే విష‌యం అర్థ‌మ‌య్యే ఉంటుంది. అందుకే అధికారంలోకి మ‌ళ్లీ రావ‌డం త‌ప్పిదారే అని త‌న‌కు తానుగా నిజాన్ని ఒప్పుకున్నాడు కేటీఆర్‌. కానీ జ‌నం ఈ మాట‌ల‌ను విన్నారు.

నువ్వ‌న్న‌ది మీ అంత‌ర్గ‌త స‌మావేశంలో కాదు. బ‌హిరంగ వేదిక మీద‌. జ‌నం తీర్పును కూడా మీరే డిసైడ్ చేసేసుకుంటే.. కేసీఆర్ గ‌తంలో అన్న‌ట్టుగా మ‌రో ఇర‌వై ఏళ్లూ మేమే.. అనే అహంభావ ప్ర‌క‌ట‌న‌లాగే ఉంటుంది. పైపెచ్చు మ‌మ్మ‌ల్ని ఓడ‌గొట్టి జ‌నం చాలా త‌ప్పు చేశారు. ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారు.. అని కూడా అనేస్తున్నారు. ఇంకా అనుభ‌వించండిరా అని శ‌పిస్తున్నారు కూడా. పాపం.. రామ‌న్న‌..! కేసీఆర్ ఆన‌వాళ్లు ఎవ‌రో వ‌చ్చి చెరిపేయాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్క కేటీఆర్ చాలు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed