వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌:

రిటైర్డ్ టీచ‌ర్‌గా కాట్ప‌ల్లి శ‌మంతా అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఆమె భ‌ర్త న‌రేంద‌ర్‌రెడ్డి విద్యావేత్త‌, కాల‌నీలో త‌ల‌లో నాలుక‌లా ఆప‌ద‌లో నేనున్నానని ఆదుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న నాయ‌కుడు. న‌గ‌రంలోని 19 వ డివిజ‌న్ నుంచి శ‌మంత న‌రేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. బుధ‌వారం న‌గ‌రంలోని శ్రీ నీల‌కంఠేశ్వ‌రాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం డివిజ‌న్ ప‌రిధిలోని కంఠేశ్వ‌ర్, కంఠేశ్వ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాలు, గూపన్‌ప‌ల్లి శివారు, డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు కాల‌నీల్లో ఆమె ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌తీ ఇంటికి వెళ్లి ఓట‌రును క‌లిశారు. ఓటును అభ్య‌ర్థించారు.

కాల‌నీ వాసుల‌కు ఎన్నో ఏండ్లుగా సుప‌రిచితురాలైన త‌ను, త‌న కుటుంబం ఎల్ల‌వేళ‌లా డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి స‌మ‌స్యలు స‌త్వ‌రం ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అధికార పార్టీని గెలిపించుకోవ‌డం వ‌ల్ల అభివృద్ధి ఎంతో జ‌రుగుతుంద‌ని, నిధుల లేమీ లేకుండా స‌ర్కార్‌తో మాట్లాడి నిధులు రాబ‌ట్టుకోవ‌చ్చ‌ని ఆమె ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. తొలిరోజు ప్ర‌చారానికి మాజీ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కురాలు ఆకుల లలిత‌.. శ‌మంత నరేంద‌ర్‌రెడ్డిల‌కు మ‌ద్ద‌తుగా హాజ‌ర‌య్యారు. ప్ర‌చారంలో పాల్గొన్నారు. అభ్య‌ర్థితో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం చేశారు. శ‌మంత న‌రేంద‌ర్‌రెడ్డిని గెలిపించుకుని డివిజన్‌లోని అన్ని కాల‌నీల‌ను ఎంతో అభివృద్ధి చేసుకోవాల‌ని ఆమె కోరారు. ఇంటింటి ప్ర‌చారానికి అనూహ్య స్పంద‌న ల‌భించింది. అమ్మ‌ల‌క్క‌లు శ‌మంతాతో క‌లిసి ప్ర‌చారంలో పాల్గొన్నారు.