(దండుగుల శ్రీనివాస్)
మరోసారి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. మామూలుగా కాదు. హాట్ హాట్‌గా. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం ప్రస్తావించిన ఆయన.. కేసీఆర్‌నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెండ్లాంమొగల ఫోన్లు వినే నువ్వు.. అన్నం తింటున్నావా? నువ్వు మనిషివేనా? అని తిట్టిపోశారు. ఎవడికిరా నువ్వు జాతిపితవు.. నీ వెలమజాతికి నువ్వు జాతిపితవు.. అని దునుమాడారు. తెలంగాణ కోసం అహర్నిషలు పరితపించి, సర్వం త్యజించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితని, ఆంధ్రలో పార్టీ భూస్థాపితమై పోతుందని తెలిసీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియా తెలంగాణ తల్లి అని అని ఆయన అభివర్ణించారు.
కేసీఆర్‌ను దొంగ, లుచ్చ, దోపిడీదారుతో పోల్చారు. ఇలాంటి గలీజ్ పనులు చేసిన కేసీఆర్‌కు నోటీసులిస్తే తెలంగాణ సమాజానికే ఇచ్చినట్టు అని అభివర్ణించడంపై ఆయన మండిపడ్డారు. చేసే లుచ్చ పనులకు ఇంకా ఘోరంగా వారిని విచారించాల్సి ఉండే… నల్లగుడ్డలు వారి ముఖానికి తొడిగేదుండే.. కళ్లపైన బట్టకు రెండు రంధ్రాలు పెట్టేందుండే.. కానీ పోలీసులు మంచోళ్లు… మామూలుగా, మర్యాదగా విచారించారు.. అని వ్యాఖ్యానించారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
