(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇందూరు బీజేపీని ప‌ట్టుకుని ఇంకా వేలాడుతున్న క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు ఇప్పుడు భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్నారు. భాయ్‌సాబ్ అంటే ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌. తెలంగాణవాదం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో నిజామాబాద్ ఉప ఎన్నిక‌లో డీఎస్‌ను ఓడ‌గొట్టిన చ‌రిత్ర యెండ‌ల‌ది. పార్టీని న‌మ్ముకుని ఉన్న‌వారిని, సిద్దాంతాల‌కు అనుకూలంగా ప‌నిచేసిన నిజాయితీ ప‌రులైన కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకుంటాడ‌నే పేరు ల‌క్ష్మీనారాయ‌ణ‌కుంది. కానీ అర్వింద్ ఒక్క‌సారి ఎంట‌ర్ అయిన త‌రువాత పార్టీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతా తానై నడిపిస్తున్నాడు. యెండ‌ల‌నే కాదు.. ఆయ‌న వర్గాన్నే దూరం పెట్టేశాడు అర్వింద్‌.

ఇప్పుడు మ‌ళ్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్నారు. ఆయ‌నేఉంటే మాకు న్యాయం జ‌రిగేద‌ని వాపోతున్నారు. అర్వింద్ మాత్రం టికెట్లు ఆశించినవారు పార్టీ వాళ్లు కాక‌పోయినా.. పార్టీ సిద్దాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోయినా.. డ‌బ్బులుంటే చాలు టికెట్లిచ్చేస్తున్నాడ‌ని గుర్రుమంటున్నారు. ఇందూరు బీజేపీ ఇప్పుడు అర్వింద్ పార్టీగా మారింది. పూర్తిగా క‌మ‌ర్శియ‌ల్ అయిపోయింద‌ని మండిప‌డుతున్నారు. త‌ను అనుకున్న‌దే అక్క‌డ వేదం.. నో సీరియారిటీ, నో సిన్సియారిటీ.. ..ఇప్పుడ‌క్క‌డ అదే సిద్దాంతం న‌డుస్తున్న‌ద‌ని భ‌గ్గుమంటున్నారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999