(దండుగుల శ్రీ‌నివాస్‌)

హెచ్‌. గంగారం అంటే అంద‌రికీ గుర్తొచ్చేది నిజామాబాద్‌. నిజామాబాద్ అంటే హెచ్‌. గంగారాం… హెచ్. గంగార‌మంటే నిజామాబాద్‌… అలా ఉండేది దీని పేరు. ఆ పేరే ఓ బ్రాండ్‌. నిజామాబాద్‌తో ద‌శాబ్దాల చ‌రిత్ర దానికి. ఇక్క‌డి ఇందూరు ప్ర‌జ‌ల‌తో పెన‌వేసుకున్న బంధం.. అనుబంధం దానిది. అది నిన్న‌టి దాకా కొన‌సాగింది. ఇక‌పై ఆ పేరు విన‌ప‌డ‌దు. క‌న‌బ‌డదు. నిజామాబాద్‌తో ఇక ఆ బంధం బంద్ అయిపోయింది. మారిన మార్కెట్ ప‌రిస్థితుల‌న‌వ‌చ్చు.. వ‌స్త్ర వ్యాపారంలో పెరిగిన పోటీ కావొచ్చు.. కాల‌నుగుణంగా న‌డుస్తున్న ట్రెండ్‌క‌నుగుణంగా ఫాలో కాక‌పోవ‌డ‌మూ కావొచ్చు… కార‌ణ‌మేదైనా కానీ ఆ పేరెన్నిక‌గ‌న్న‌.. చ‌రిత్ర లిఖించుకున్న‌… హెచ్‌. గంగారం ఇపుడు తెర‌మ‌రుగైంది. ఆ దుకాణాన్ని మూసేశారు.

పేరు మార్చి అన‌ఘా అని పెట్టినా… అది మ‌న‌లేక‌పోయింది. జిల్లా కేంద్రంలోని ఆ వ్యాపార స‌ముదాయ భ‌వ‌నాన్ని అమ్మేశారు. దీన్ని చెన్నై షాపింగ్ మాల్ మేనేజ్‌మెంట్ తీసుకున్న‌ది. త్వ‌ర‌లో ఆర్.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ పేరుతో ఇక్క‌డ బ్రాంచీ తెర‌వ‌నుంది. కానీ ఈ వార్త కొంచెం బాధ‌నిపించేదే. కాల‌మెప్పుడూ ఒక‌లా ఉండ‌దు. తీపి జ్ఞాప‌కాలు మిగుల్చుతుంది. చేదు గురుతులు వ‌దులుతుంది. ఇదీ అలాంటిదే అనుకోవాలి. ప్రేమించుకుందాం రా… సినిమాలోని ఓ ప‌నైపోతుంది బాబు పాట‌ను పేర‌డీ చేసి ధ‌రలు త‌క్కువ.. క్వాలిటీ ఎక్కువ హెచ్. గంగార‌మండీ బాబు.. అనే పాట‌ కూడా ఓ తీపి గురుతే ఇందూరు వాసుల‌కు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999