(దండుగుల శ్రీనివాస్)
బీఆరెస్ నేతలకు అధికారం ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కి తైతక్కలాడారు. ఇప్పుడు అధికారం పోయి.. తలతిక్కగా ఏదో ఒకటి వాగుతూ తిక్క సన్నాసిలా చేస్తున్నారు. ఇది అందరికీ వస్తుంది ఆ పార్టీలో. కేటీఆర్‌తో సహ. క్రిషాంక్ ఓ పోస్టు పెట్టాడు. ఏదో స్వామిభక్తి ప్రదర్శిస్తూ.. కేటీఆర్తోనో, కేసీఆర్‌తోనో శభాష్ అనిపించుకోవాలనే యావే తప్ప సబ్జెక్టు బేస్డ్గా మాట్లాడే దమ్ము, తెలివి.. విషయ పరిజ్ఞానం వీరికి లేదని వారే పదే పదే నిరూపించుకుంటూ ఉంటారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కాటన్ మ్యాన్‌గా, ఇప్పుడున్న సీఎం రేవంత్‌ను కాస్ట్లీ మ్యాన్‌గా అభివర్ణిస్తూ ఇద్దరూ ధరించి ఉన్న దుస్తులతో కూడిన ఓ ఫోటోను పెట్టుకున్నాడు. రేవంత్ వేసుకున్న టీ- షర్టు విలువ రూ. 1.60 లక్షలుగా ఉంది అని చెప్పడమే ఈ క్రిషాంక్ ఉద్దేశ్యమై ఉంటుంది. అదేదో సూటిగా చెప్పినా సరిపోయేది. ప్రతీదానికి పోలిక అవసరం కదా. పెద్ద సారును గుంజుకొస్తే.. ఇంకా రంజుగా ఉంటుందనుకున్నాడు ఈ వివాదంలోకి.
అంతే హాయిగా తన మానానా తను ఫామ్ హౌజ్‌లో సేద తీరుతున్న కేసీఆర్ ఫోటో ఒకటి లాగి.. చూశావా.. ! మాసారు ఖద్దరు ధరించాడు. నువ్వు చూడు లక్షలు పెట్టి టీ షర్టులు వేసుకుంటున్నావు..!అని నిలదీసి, ప్రశ్నించి, ఓ పేద్ద పరిశోధన చేసి తను సాధించిన ఘనతలా చెప్పుకోవాలనుకున్నాడు క్రిషాంకు. కానీ ఇది కాస్తా ఎదురు తన్నింది. షరా మూమూలుగానే. ఫామ్‌హౌజ్‌లో పడుకుని ప్రజలపై ఏమాత్రం చింత లేకుండా, పట్టింపు లేకుండా పడుకున్న కేసీఆర్ ప్రస్తావన తీసుకురాగానే సోషల్ మీడియా ఒంటికాలిపై లేచింది. థూ .. మీరూ మీ బతుకులు.. ఆయన ఓ మాజీ సీయమేనా? ఇంత నిర్లక్ష్యంగా ఉండి.. జనం గోడు కనీసం పట్టించుకోకుండా ఉన్న ఆ లీడర్ ఒక లీడరేనా? అని తుక్కు తుక్కు తిట్టి అక్షింతలు వేస్తున్నారు. షట్.. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని, పెద్ద సారుతో పాటు చిన్నసారుతో కూడా దొబ్బులు తప్పేలా లేవని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడిప్పుడు. ఒక వేలు అటు చూపితే.. మిగిలవన్నీ పదేండ్లు పాలించిన మిమ్మల్నేచూపుతాయి.. తమ్ముడు.. జర సూస్కోని. లేదా కాస్కోండ్రి.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
