వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ముస్లిం మైనార్టీల్లో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. కేసీఆర్ ముస్లింల మద్దతు తీసుకుని .. వారికి తీరని ద్రోహం చేశారనే విషయం ఇప్పుడు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీనికి ఉదాహరణలను కూడా వీడియోల రూపంలో బయటపెడుతున్నారు. పాత సెక్రటేరియట్‌ను కూల్చినప్పుడు అందులో రెండు మజీదులో ఉండేవి. వీటినీ కేసీఆర్ కూల్చేశాడు. తిరిగి వాటిని పునర్నిర్మిస్తానని ముస్లింలకు మాటిచ్చి వాటిని కూల్చేశాడు. కానీ బయట ఒకటే నిర్మించి వదిలేశాడు. దీనిపై ముస్లింలు భగ్గుమంటున్నారు. అంతే కాదు.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని మాటిచ్చి మోసం చేసిన విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ తీరుపై .. తమను మోసం చేసిన వైనంపై భగ్గుమంటున్నారు. తమను దగ్గరనే పెట్టుకుని ఇంతలా మోసం చేస్తాడా? మా మజీదులో కూల్చేసిన కేసీఆర్ అధికారాన్ని కూడా అల్లా కూల్చేశాడు. వారి కుటుంబం చిన్నాభిన్నమైంది… మా ఉసురు తగిలిందని శాపానార్ధాలు పెట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి మాగంటి సునీతను నిలబెట్టి సానుభూతి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన బీఆరెస్ పార్టీకి ముస్లింలు ఎవరూ ఓటేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న ముస్లింలు ఆత్మవంచన చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు.
