(దండుగుల శ్రీ‌నివాస్‌)

అంతేమ‌రి. చేసిన పాపాలు ఊరికే పోవంటారు. అవి వెంటాడుతూనే ఉంటాయి. కాలం క‌లిసి వ‌చ్చి, అధికారంలో చేతిలో ఉన్న‌ప్పుడు ఆగ‌లేదు. ఆడింది ఆట పాడింది పాట‌. బినామీల పేరుతో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలిన యువ‌రాజు.. జూబ్లీహిల్స్‌లో అంతా తానై వ్య‌వ‌హ‌రించాడు. రాజు నేనే, మంత్రి నేనే.. అస‌లు హైద‌రాబాదే నాది.. నాకు తెల‌వ‌కుండా ఏదీ జ‌ర‌గొద్దు.. ఏం చేసినా నేనే చేయాలి.. ఇలా ఫిక్స‌యిపోయి బ్లైండ్‌గా ముందుకు పోయాడు. అప్పుడంతా ఓకే. కానీ ఇప్పుడే ఆ పాపం పండి ఇలా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక‌కు పోలింగ్ డేట్ మ‌రీ ద‌గ్గ‌ర ప‌డ్డ స‌మ‌యంలో కేటీఆర్ వ్యూహానికి మంట‌లు పెట్టేలా మాగంటి మ‌ర‌ణంపై ఆయ‌న త‌ల్లి మాట్లాడిన వేద‌నాపూరిత వ్యాఖ్య‌లు దూమారం రేపాయి.

సీఎం రేవంత్‌రెడ్డి అన్న‌ట్టుగా ఏ త‌ల్లి కూడా త‌న కొడుకు మ‌ర‌ణం గురించి అబ‌ద్దాలు చెప్ప‌దు. ఎంత‌లా ఆ మ‌న‌సు విల‌విల్లాడి ఉంటే ఆమె ఆ నిజాల‌ను బ‌య‌ట‌కు చెప్పి ఉంటుంది. అవును… నిజ‌మే! ఆమె క‌డుపుతీపి బాధ వ‌ర్ణ‌నాతీతం. అందుకే ఆమె ఓపెన్‌గా ధైర్యంగానే చెప్పేసింది. కొడుకు మ‌ర‌ణానికి కేటీఆర్ కార‌ణ‌మ‌ని. ఆ స‌మ‌యంలో అత‌ని రాక‌, వ్య‌వ‌హ‌రించిన తీరు.. అన్నీ అన్నీ ఆమె క‌ళ్ల‌ముందుంచింది. భౌతిక కాయానితో వేలిముద్ర‌లు తీసుకున్నాడ‌నే ప్ర‌చార‌మూ ఊపందుకున్న త‌రుణంలో… కేటీఆర్ బినామీగా మాగంటి గోపినాథ్ ను పెట్టుకుని చేసిన అరాచ‌క‌, అవినీతి చ‌ర్య‌ల‌పై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌చ్చ ర‌చ్చ అవుతోంది జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో.

సెంటిమెంట్ ప్లే చేసి.. సునీత‌తో నాలుగు క‌న్నీటి బొట్లు కార్పించి.. మిగిలిన క‌థంతా తాను న‌డిపించి.. ఎలాగైనా గెలిచి .. ఇగో చూశారా.. ఈ ఫ‌లితాలే కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి రెఫ‌రండ‌మ‌ని చంక‌లు గుద్దుకోవాల‌ని వేసిన ఎత్తుగ‌డ‌ల‌ను ఆ మాతృమూర్తి తుత్తునియ‌లు చేసింది. ఉన్న కాస్త ఇమేజీ ప‌డిపోయి డ్యామేజీ లెవ‌ల్ పీక్ పోయింది. క‌ళ్లు బైర్లు క‌మ్మి కేటీఆర్ ముఖం కూడా పీక్కుపోయింది. పాపం.. కేటీఆర్.. ఏదో అనుకున్నాడో.. ఇప్పుడు ఏదో జ‌రుగ‌తుంది. తానొక‌టి త‌లిస్తే.. దైవ‌మొక‌టి త‌లిచింద‌నుకుంటా! చేసిన పాపాలు అలా ఉన్నాయి మ‌రి.. కానీ ఇవ‌న్నీ ఇప్పుడే బ‌య‌ట‌ప‌డాలా!? డ్యామిట్ క్లైమాక్స్ లో క‌థ అడ్డం తిరిగింది. వ్యూహం బెడిసింది. పాపం పండింది. బీఆరెస్ జూబ్లీహిల్స్ సెంటిమెంట్ సినిమాకు ఇలా శుభం కార్డు ప‌డింది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999