వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

పాపం పండింది… ఇప్పుడు ఒక్కొక్క‌టిగా అవి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అధికారం ఉన్న‌నాళ్లు ఏం చేసినా చెలామ‌ణి అయ్యింది. మాకు తిరుగే లేద‌నుకున్నాడు. అంతా తానై న‌డిపించాడు. బినామీల రాజ్యం ఏలాడు. జూబ్లీహిల్స్ కూడా అందులో భాగ‌మే. పేరుకే మాగంటి గోపీనాథ్ అక్క‌డి ఎమ్మెల్యే. అంతా కేటీఆర్ చెప్పిన‌ట్టే జ‌రుగుతుంది. చివ‌ర‌కు ఇది ఎక్క‌డి దాకా వ‌చ్చిందంటే… గోపీనాథ్ మ‌ర‌ణానికి, కేటీఆర్‌కు లింకు ఉన్న‌ద‌నేలా. అనుమానాలు వ‌చ్చేలా. ఈ ముచ్చ‌ట మేమంటున్న‌ది కాదు. స్వ‌యంగా గోపీనాథ్ త‌ల్లే ఆరోపించింది. త‌న కొడుకు మ‌ర‌ణంపై అనుమానాలున్నాయ‌న్న‌దామె.

ఆరోగ్యంగా ఉండే త‌న కొడుకు .. ఉన్న‌ప‌ళంగా ఎందుకు అనారోగ్యం పాల‌య్యాడు. ఎప్పుడు ఆస్ప‌త్రిలో చేరాడు..? ఎవ‌రు చేర్చారు..? మాకెందుకు స‌మాచారం ఇవ్వలేదు..? చ‌నిపోయినా.. మూడు రోజులు ఎందుకు ఆస్ప‌త్రిలోనే ఉంచేశారు..? కేటీఆర్ వ‌చ్చిన త‌రువాతే ఎందుకు డిక్లేర్ చేశారు..? అస‌లేం జ‌రిగింది..?? ఇవ‌న్నీ ఇవ‌న్నీ ఒక్క కేటీఆర్‌కే తెలుస‌న‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేగింది. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌కు పోలింగ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డిన స‌మ‌యంలో ఆమె ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం.. బీఆరెస్ శిబిరంలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగాయి.

గోపీనాథ్‌ను క‌డ‌సారి కూడా చూసుకోకుండా చేశారు.. కేటీఆర్‌కు చెప్పినా ప‌ట్టించుకోలేదు… ఎందుకు? ఇవ‌న్నీ కేటీఆర్‌ వ‌ల్లే జ‌రిగాయి… నా కొడుకు మ‌ర‌ణం వెనుక మిస్ట‌రీ కేటీఆర్‌కు తెలుసు.. ఎందుకంటే కార‌కుడు అత‌డే కాబ‌ట్టి అని ఆమె మీడియాతో మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే మాగంటి సునీత.. సొంత భార్య కాద‌ని, గోపీనాథ్‌తో ఆమె రిలేష‌న్‌లో మాత్ర‌మే ఉంద‌ని అత‌ని కొడుకు ఫిర్యాదు చేయ‌డం కూడా ర‌చ్చ ర‌చ్చ చేసింది. సానుభూతి పొంది ఓట్లు దండుకొని గెల‌వాలకున్న కేటీఆర్‌కు ఇలా త‌ను చేసిన పాపాలు స‌రిగ్గా స‌మ‌యానికి కాళ్ల‌కు వేళ్ల‌కు చుట్టుకున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు బొక్క‌బోర్లా ప‌డేలా చేస్తున్నాయి. చేసిన పాపం ఊరికే పోదంటారు.. ఇదే కాబోలు!