(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఒక్క ఆడ‌బిడ్డ‌.. అదే క‌విత‌పై మూకుమ్మ‌డి దాడి జరుగుతోంది. ఆమె కుటుంబం నుంచే. ఆమె కుటుంబ స‌భ్యులే. ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రో కాదు. ఆమే. స్వ‌యంగా క‌వితే ఈ విష‌యాన్ని మ‌రోసారి వెల్ల‌డించింది. ఇక్క‌డ రామ‌న్న పేరు ప్ర‌స్తావ‌న రాకుండా బీఆరెస్ పార్టీగా అత‌ని పేరును తీసుకున్న‌ది. ఇక మిగిలిన ఇద్ద‌రు.. హ‌రీశ్‌, సంతోష్‌ల పేర్లు ఓపెన్‌గానే ప్ర‌క‌టించింది. గ‌తంలో మాదిరిగానే. ఈ ముగ్గురు క‌లిసి సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌పై దాడికి దిగుతున్నార‌ని ఆమె మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. సీఎం రేవంత్ కూడా ఇటీవ‌ల క‌విత ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఆమె ఇంటి నుంచే ఆమె దాడికి గుర‌వుతున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. ఇదే విష‌యాన్ని మీడియా ప్రస్తావించ‌గా… సీఎం అన‌డం కాదు.. అంద‌రికీ తెలుసు. త‌న‌పై ఆ ముగ్గురి నుంచి వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నార‌ని అని ధ్రువీక‌రించారు. ఆ పార్టీతో ఆమెకు మ‌రింత దూరం పెరిగి.. అంత‌రం మ‌రింత‌గా బ‌ల‌ప‌డింద‌న‌డానికి ఆమె ఇవాళ మాట్లాడిన మాట‌లే తాజా ఉదాహ‌ర‌ణగా నిలుస్తున్నాయి.

పార్టీలో నాకు జరిగిన ఇబ్బందులపై సీఎం ఏమన్నారో నాకు తెలియదు… కానీ పార్టీలో నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలకు తెలుసు. హరీష్ రావు మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా నాపైన దాడి చేస్తున్నాయి…అని అన్నారామె.