(దండుగుల శ్రీనివాస్)
ఎంత గాదన్నా.. కన్న కూతురు. కానీ అన్నీ నిజాలే చెబుతుంది. నిజాలను స్వీకరించేడు. కన్న కూతురును బయటకు పంపలేడు. ఎలా..? ఎలా..? తర్జన భర్జన నడుమ ఎట్టకేలకు ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేశాడు కేసీఆర్. దీనికి వెనుక కేటీఆర్ ఒత్తిడి మామూలుగా లేదు. మొదటి నుంచి ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయమే పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కవిత ఫ్లెక్సీలు తగలేయాలని. కానీ చాలా ఇబ్బందికరంగానే ఆ ప్రోగ్రం నిర్వహించారు వారంతా. కవిత అని ఏకవచనాన్ని కూడా సంబోధించేంత ధైర్యం చేయలేదు బీఆరెస్ నిరసనకారులు. కవితక్క… ఇలా చేయడం బాగలేదు. నిన్ను బీజేపీ ఆడిస్తోంది. నీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నావు… కేసీఆర్ వల్లే పార్టీ .. పార్టీతోనే కేసీఆర్.. అని స్పీచులిచ్చారు. హరీశ్, సంతోష్‌రావుల పేర్లు తీసుకుని మరీ వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టింది. దీన్ని మంచి సమయంగా తీసుకున్న కేటీఆర్.. తండ్రి కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాడు. ఎలాగైన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని. దీంతో కేసీఆర్‌కూ తప్పలేదు.
మొత్తానికి దయ్యాల గడీ నుంచి ఆమె విముక్తి దొరికింది. మొన్నటి దాకా మాట్లాడాల వద్దా అని ఆచి తూచి మాట్లాడిన కవిత.. ఇప్పుడిప్పుడే మెల్లగా పేర్లతో సహా వారి జాతకాలు బయటపెడుతోంది. ఈ తరుణంలో పార్టీ సస్పెన్షన్ డిసిషన్ తీసుకోవడంతో ఆమెకు మరింత స్వేచ్ఛ దొరికింది. ఇంకా వెసులుబాటు లభించింది. ఇప్పటికే ఆమె రెడ్‌బుక్‌లో చాలా మంది బీఆరెస్ నేతల పేర్లున్నాయి. ఇప్పుడందరి జాతకాలు బయటపడనున్నాయి. ఆమె ఇక చెలరేగిన కాళికనే కానుంది. మాజీ ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని మాజీ మంత్రులు.. ఎవరినీ వదలకుండా పార్టీని డ్యామేజీ చేసి కేసీఆర్‌ను ఆగం పట్టించిన వారిని బజారు కీడ్చే కసితో ఆమె ఉన్నది. ఇప్పుడు మంచి అవకాశం కల్పించారు వారే. ఇక ముసుగులో గుద్దులాట ఉండదు. నేరుగా అటాకే. అక్క మరో రూపం బీఆరెస్ నేతలకు సాక్షాత్కరించనున్నది.
Dandugula Srinivas
SeniorJournalist
8096677451