(దండుగుల శ్రీనివాస్)
మనది మంగళారం.. మందిది సోమవారం .. అచ్చంగా ఇలాగే ఉంది కేటీఆర్ ఉవాచ. తనకు ఏదో కౌంటర్ వేశాడని, తిరిగి ఎన్‌కౌంటర్ చేద్దామనుకుని తనకు తానే కాల్చుకుని చచ్చినట్టుంది ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇట్లనే ఉన్నయ్. బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ ఏదేదో మాట్లాడుతుంటే.. మధ్యలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జోక్యం చేసుకుని కడిగిపాడేశాడు. చాల్చేలేవయా… చెప్పొచ్చావ్.. పెద్ద.. ! అనే రేంజ్‌లో తీసిపారేశాడు. నిజం చెప్పాలంటే కేటీఆర్‌కు సరైన, ధీటైన జవాబే సందర్బోచితంగా ఇచ్చాడు కూడా. దీంతో కేటీఆర్‌కు మండినట్టుంది. మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోవడం చూసిన కానీ..ఇదేందీ.. విప్‌లు కూడా మధ్యలో తగులుకుంటున్నారు.. అని వెటకారం ఆడి.. సర్ సర్లే.. ఆది శ్రీనివాస్ మావోడే గానీ, ఆయన త్వరలో మంత్రి కావాలని కోరుకుంటున్నాను.. భవిష్యత్తులో సీఎం కూడా కావాలి.. అని ఆకాంక్షించాడు. ఇది ఆకాంక్ష అనుకోవడానికి లేదు. వెటకారం కలగలిపిన అహంకారపూరిత, గర్వంతో కూడిన ఎద్దేవ. అవును.. కాక మరేందీ..?
బీసీని సీఎం కావాలని కోరకుంటున్నావ్ బాగనే ఉంది. మరి మీ పార్టీలో బీసీ సీఎం అవుతాడా..? అదే .. భయపడకు.. నేనది భవిష్యత్తులోనే. దళిత సీఎం అని ఉదరగొట్టి… తండ్రి పదేండ్లు ఏలిండు. ఇప్పుడు కొడుకు కోసం అన్ని రకాల ప్రయత్నాలు, పొత్తులు, విలీనాలు.. దేనికైనా రెడీ అన్నట్టుగానే ఉన్నారుగా. సందర్భం మంచిగా క్యాచ్ చేసిండు మధ్యలో పొన్నం ప్రభాకర్.. అసలు బీసీల గురించి మాట్లాడే సీనే మీకు లేదన్నాడాయన. పార్టీ ప్రెసిడెంట్ మీరే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటూ మీరే… శాసన సభా పక్ష నేతగా కూడా మీరే… అని వాళ్ల బీసీ నినాదం ఎంత బలమైనదో తేల్చి చెప్పారాయన. చేప్పేవి శ్రీరంగనీతులన్నట్టుగానే ఉన్నాయి కేటీఆర్ మాటలు. ఇదే ముచ్చట అనుకుంటున్నారంతా.