(దండుగుల శ్రీ‌నివాస్‌)

కింగ్ నాగార్జున‌. అపార అనుభ‌వం, క‌మ‌ర్శియ‌ల్ మెంటాలిటీ. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌స‌త్వాన్ని నిలిపిన కొడుకు. న‌ట‌న‌లో చాలా మైన‌స్‌లున్నాయి. కానీ విభిన్న పాత్రాలు ఎంచుకుని మెప్పించ‌డంలో స‌క్సెస‌య్యాడు. చేతిలో చైన్ ప‌ట్టుకుని శివ అనిపించుకున్నా.. గిటార్ మీటుతూ గ్రీకు వీరుడిలా ఫోజులు కొట్టినా… డిప్ప క‌టింగుతో అన్న‌మ‌య్య ప్రాత వేసిన ఆయ‌న‌కు న‌ప్పింది. న‌టించి మెప్పించాడు. పాత్ర‌ల్లో జీవించాడు. కానీ అత‌ని వారసులు ఇంకా స‌క్సెస్ లేక త‌ల్ల‌డిల్లుతున్నారు. అదేందీ నాగ చైత‌న్య ప‌ర్వ‌లేదు క‌దా. మంచి వేశాలే ప‌డ్డాయి. బాగానే న‌టిస్తున్నాడు క‌దా అని అంటారా.

కానీ స‌క్సెస్ రేటు లేదు. కానీ అఖిల్ క‌న్నా చాలా బెట‌ర్ న‌ట‌లో. రూపు రేఖ‌ల్లో. అమ్మ పోలిక వ‌చ్చింది అఖిల్‌కు. ఇంకా ఆ మోములో అదే బాల్ ప‌చ్‌ప‌న్ ఛాయ‌లు. అందుకే అటు లవ‌ర్ బాయ్ కాలేక‌పోయాడు. ఇటు ఏజెంట్‌గా మాస్ పాత్ర‌లోనూ మెప్పించ‌లేక‌పోయాడు. ఇక ముందు కూడా అత‌గాడి సినిమాలు పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట‌య్యే చాన్స్ లేదు. ఓమోహ‌న్ బాబులా, ఓ బ్ర‌హ్మానందంలా, ఓ ఏవీఎస్‌లా, ఓ బెల్లంకొండ సురేష్‌లా.. ఇంకా చాలా మందే ఉన్నారు. వీరిలా వార‌స‌త్వ న‌ట‌న‌ను బ‌ల‌వంతంగా జొప్పించి మెప్పించాల‌ని చూసినా అది కుద‌ర‌లేదు. ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు. తిప్పికొట్టారు.

కానీ ఇలా పాతుకుపోయిన నాగ్ లాంటి వారు, మోహ‌న్ బాబు లాంటి వారు మాత్రం సినిమాలు తీస్తూనే ఉంటారు. అది పిల్ల‌ల మీద వారికున్న ప్రేమ‌. కానీ ప్రేక్ష‌కుల నాడి తెలుసుకుని సైలెంట్ కావాలె క‌దా. కారు. డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర కూడా చేతులు కాల్చుకుని వెంట‌నే సైలెంట్ అయిపోయాడు. కానీ వీళ్లు కారు. మంచిదే అది కూడా ఇండ‌స్ట్రీకి. ఓ న‌లుగురు బ‌తుకుతారు. బ‌త‌క‌ని.

 

You missed