(దండుగుల శ్రీనివాస్)
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ప్రకటించిన కవిత.. నిరవధికంగా నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. బుధవారంతో ఆమె దీక్ష మూడో రోజు చేరుకున్నది. ఖమ్మం నుంచి నేరుగా ఆమెను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురావడంతో జాగృతి కార్యాలయంలోనే ఆమె దీక్షకు దిగారు. . సర్కార్ దిగొచ్చేదాకా దీక్ష వదిలేదే లేదని.. స్థలం మారినా తన నిర్ణయం మారదని ఆమె ప్రకటించారు. ఆమె దీక్షకు ప్రజా సంఘాల నుంచి, తెలంగాణ ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కవితకు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తున్నది.
పేద ప్రజల కోసం ఆమె పోరాడుతున్న వైనం అందరినీ ఆకట్టుకున్నది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె దీక్షకు సంఘీభావం తెలుపుతూ జాగృతి ఆఫీసుకు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు వచ్చి వెళ్తున్నారు. ఏదో తూతూ మంత్రంగా పరామర్శలు చేసి వెళ్లిపోయిన ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బీఆరెస్‌తో పోల్చితే కవిత వెయ్యిరెట్లు బెటరని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించండం గమనార్హం. ప్రభుత్వానికి అహంకారం తలకెక్కి.. తమను ఎవరూ ఏమీ చేయరనే నియంత పోకడలతో పోతున్నదని, అందుకే ఈ విధంగా పేదలంటె లెక్కలేకుండా వారిపై , వారి ఇళ్లపై దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మీ మార్పు చాలు.. ఇక మీరు దిగిపొండని దుమ్మెత్తిపోస్తున్నారు. రాహుల్ గాంధీని పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ చర్యలు కనిపించడం లేదా? ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటానికి ఇక్కడికి రావొచ్చుగాని, పేదల ఇళ్లు నేలమట్టం చేసి వారిని రోడ్డు పాలు చేసి వికటాట్టహాసం చేస్తున్న తీరును చూసేందుకు రావా? రా ఒకసారి చూసి పో! అని ధ్వజమెత్తుతున్నారు. కవిత పోరాటంతో ఇప్పుడు ఈ ఇష్యూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కవిత.. రాహుల్ గాంధీకి ఈ విషయమై బహిరంగ లేఖ రాశారు.
