వాస్త‌వం ప్ర‌తినిధి – మంచిర్యాల‌:

బాల్క సుమ‌న్ బ‌రితెగించాడు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌దేళ్లు చూపిన బ‌లుపు చేష్ట‌లే ఇప్పుడూ చూపాడు. ఓడిన ఫ్ర‌ష్టేష‌న్ కూడా దీనికి తోడ‌య్యింది. దీంతో రామ‌న్న మెచ్చుకోలు కోసం గుంపుగా వ‌చ్చి గుండాగిరీ చేశాడు. అచ్చం వీధిరౌడీలా ప్ర‌వ‌ర్తించాడు. మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి కారుపై దాడి చేయ‌డంతో పాటు కాంగ్రెస్ కార్య‌క‌ర్తల‌పై దాడికి దిగాడు. రాళ్లు విసిరేయించాడు త‌న అనుచ‌ర మూక‌ల‌తో. ఈ దాడిలో మంత్రి కారు అద్దాలు ధ్వంసం కావ‌డంతో పాటు ఓ కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్య‌క‌ర్త గాయ‌ప‌డ్డారు. దీన్ని మంత్రి వివేక్ తీవ్రంగా ఖండించారు. బాల్క సుమ‌న్ రౌడీయిజ‌యం చెలాయించి…ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశాడ‌ని మండిప‌డ్డారు.

అస‌లేం జ‌రిగింది.. మంత్రి మాట‌ల్లో..

 

క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ ఎన్నికల సందర్బంగా బీఆర్ఎస్ నాయకుడు బల్కా సుమన్ రౌడీయిజానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారని తీవ్రంగా విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, పోలీసుల బారికేడ్లు ఉన్నప్పటికీ, బాల్క సుమన్ గుంపులతో అక్కడికి వచ్చి తమ వాహనంపై దాడి చేశారన్నారు. తమ కారుపై దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్ మరియు కాంగ్రెస్ కార్యకర్త గాయపడ్డారని వెల్లడించారు.

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. బాల్క సుమన్ ఎన్నికలలో ఒడి పోయినప్పటి నుండి ఇలాగె ప్రవర్తిస్తున్నారని అన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం, చైర్మన్ ఎన్నికల సందర్బంగా, తాను , ఎంపీ వంశీ కృష్ణ కో-ఆప్షన్ సభ్యులుగా తమ హక్కును వినియోగించుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు మంత్రి తెలిపారు. అంత లో నే బాల్క సుమన్, అనుచరులు వారి పై దాడి చేసారని అన్నారు.

ఈ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిర్వహించబడినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత సృష్టించడానికి ప్రయత్నించారని మంత్రి పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిందని, బెదిరింపులు, దౌర్జన్యాలు జరిగాయని గుర్తుచేశారు.

బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించి అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో గుంపులుగా తిరగడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో తమ కౌన్సిలర్‌పై దాడులు జరగడంతోనే తాము బయటకు రావాల్సి వచ్చిందన్నారు.

దాడులకు సంబంధించిన వీడియోలు స్పష్టంగా ఉన్నాయని, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టిన రాజకీయ సంస్కృతి బీఆర్ఎస్‌దేనని విమర్శించారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ బీఆర్ఎస్ కార్యకర్తపై కేసులు పెట్టలేదని, ఓటమి ఫ్రస్ట్రేషన్‌లో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ రౌడీయిజాన్ని మానుకొని ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాలని మంత్రి సూచించారు.