(దండుగుల శ్రీనివాస్)
76610 66999
నేను దగ్గరుండి అక్కడ కుర్చీ వేసుకుని మరీ పనులు చేపిస్తా..! ఈ మాటలు తరుచూ కేసీఆర్ నోటి వెంట విన్నాం. ఆయన చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల మీద ఈ మాటలన్నారు. ఈ మాటలకర్థం.. ఆయనే స్వయంగా వెళ్తాడని కాదు. నిజంగానే కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేపిస్తాడనీ కాదు. పట్టించుకుని పని చేపిస్తానని అర్థం. ఆ పనిని కమిట్మెంట్తో పూర్తి చేపిస్తానని పరమార్ధం. కానీ ఇక్కడ కోమటిరెడ్డి కూడా అట్లనే అన్నారు మున్సిపల్ ఎన్నికల వేళ. నల్లగొండను స్మార్ట్ సిటీ చేయడమే తన లక్ష్యం అన్నాడు. ఎన్నికల హామీలిచ్చారు. ఇది మామూలే కదా. అంతా ఇట్లనే అంటరు.. అని అనుకొని ఉంటరు కొందరు.
కానీ మేయర్ ఎన్నిక పూర్తయ్యిందో లేదో.. ఆ మరుసటి రోజే.. తెల్లావారు జామునే స్వయంగా ఆయన కుర్చీ వేసుకుని కూర్చున్నారు నల్లగొండ వీధుల్లో. చెప్పింది ఇలా వెంటనే పూర్తి చేసే పనికి ఉపక్రమించే నాయకులున్నారా? అంటే ఇదిగో మా మంత్రిగారున్నారు అని ఆ జనం చెప్పుకునేలా ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. నగరాన్ని అభివృద్ధి పరిచే ముందస్తు ప్రణాళికలు ఉండనే ఉన్నాయి. ఏం చేయాలో మదిలో మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. ఇక అమలే తరువాయి ..అందుకే ఇలా రంగంలోకి దిగిపోయారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
కుర్చీ వేసుకుని మరీ అక్కడి వీధుల రోడ్ల విస్తరణ, వ్యాపారాల తరలింపు, పార్కింగ్ స్థలాలను మార్చడం, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా ఇతర స్థలాలు.. ఇలా చకచకా అక్కడ ఆయన ఆదేశాలివ్వడం, అధికారులను పురమాయించడం.. ఆగమేఘాల మీద పనులు జరిగిపోవడం .. జనం అలా చూస్తుండి పోయారు. ఇది కదా కుర్చీవేసుకుని పనులు చేపించడమంటే.. ఇది కదా కమిట్మెంట్కు కార్యరూపమంటే.. అనుకుంటున్నారు జనం. మరి కోమటిరెడ్డా .. మజాకా!

Dandugula Srinivas
Senior Journalist
