(దండుగుల శ్రీనివాస్)
తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరైనా మాట్లాడితే థూ.. మీ బతుకులు చెడ.. మీవీ ఓ రాజకీయాలేనా? కేసీఆర్ చావు కోరుతారా? ఇంతకన్నా అధ్వాన్నం మరోటి ఉంటుందా? అని ఒంటికాలిపై లేచే కేటీఆర్.. ఇప్పుడు అంతకన్నా దారుణంగా, దివాళాకోరుతనంగా, అహంకారం నెత్తికెక్కిన వాడిలా మాట్లాడిండు. తన తండ్రి సమానులైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి చావు కోరాడు. అవును.. నువ్వు బతికుండటమెందుకు? చస్తే కాదా? అని నేరుగానే చావు మాటలు మాట్లాడి తన సహజ దోరణిని చాటుకున్నాడు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. పోచారంను టార్గెట్ చేశాడు కేటీఆర్. ఇంత వయస్సు వచ్చింది.. సిగ్గు లేదా పార్టీ మారడానికి అంటూనే.. నీకేం తక్కువ చేశాం.. ఇంతకన్నా చచ్చింది మేలు కదా! అని ముక్తాయింపునిచ్చాడు.
కేటీఆర్‌వి బలుపు మాటలని, ఇంకా అహంకారం తగ్గలేదని సోషల్ మీడియాలో దీనిపై మండిపడుతున్నారు నెటిజన్లు. తండ్రిలాంటి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అనాల్సిన మాటలేనా అవి కేటీఆర్‌పై ఫైర్ అవుతున్నారు. పార్టీ మారితే విమర్శించొచ్చు. దానికీ ఓ హద్దుంటుంది. కానీ నీలా మరీ చావు కోరుకునేలా ఉండకూడదు. అధికారం పోయిందనే దుగ్ధ, ఫ్రష్ట్రేషన్‌లో, సహజంగా తన తనవంతా ఉన్న అహంకారంతో అన్న బలుపు మాటలివని తిట్టిపోస్తున్నారంతా.
అయినా, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే ముఖమా నీదీ కేటీఆర్? నీ అయ్యే కదా దీనికి ఆద్యుడు. అంగట్లో బర్లను, గొర్లను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కాదా మీది? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరూ తమను అడిగేవాళ్లే ఉండొద్దని, అసలు ప్రతిపక్షమే ఉండకుండ చేయాలనే కదా మీరు ఆనాడు చేసి ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ. మరి ఇప్పుడెందుకు ఇంతలా నీల్గుతున్నావ్? అని నిలదీస్తున్నారు. ఒక్క వేలు అటు చూపితే మిగిలినవన్నీ మిమ్మల్నే చూపుతున్నాయి రామన్నా.. సిగ్గుండాలె మీకు.. అని బూతు పురాణం చదువుతున్నారు. నవ్విపోదురు మాకేటి సిగ్గు అన్నట్టుగానే ఉంది రామన్న వ్యవహారం. ఎవరెన్ని అనుకున్నా..తిట్టినా.. దుమ్మెత్తిపోసినా .. తను మాత్రం మారడం లేదు. అహంకారం వీడటం లేదు. పైగా పుచ్చు చచ్చు చావు రాజకీయాలు చేస్తూ మరింత దిగజారిపోతున్నాడిలా…అని అనుకుంటున్నారంతా.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
