వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
అధికారం ఉన్నప్పుడు కన్నమిన్నూ కానరాలే. అహంకారం పొరలు కమ్మింది. తనను మించిన ఘనుడే లేడనుకున్నాడు. హిందుగాళ్లూ బొందుగాళ్లూ అనే కాడికి వచ్చింది. నేను లేకపోతే మీ బతుకులే కష్టం.. ఇగ మీ ఇష్టం.. అనే బెదిరింపుల పర్వమూ ఫలించలేదు. జనాలు బొందపెట్టారు. నిట్టనిలువనా. బతికుండగానే. జీవచ్ఛశంలా మారిన జీవితం.. కళ్ల ముందు సాక్షాత్కరింపజేసింది కర్మఫలం. నీ పాపాలకు ఓ లెక్కుంటుంది.. అన్నీ అన్నీ చూస్తాడురా పైవాడు.. నీకుంటుందిరో….! అన్నట్టుగానే, శపించినట్టుగానే, అంతా కోరుకున్నట్టుగానే.. పాపాలన్నీ పుట్టల్లోంచి వచ్చిన పాముల్లా మెడకు చుట్టుకున్నాయి. కాటేయడమే తరువాయిగా ఉంది. కాళేశ్వరం కమిషన్.. సీబీఐ ఎంక్వైరీ.. మెడకు చుట్టుకున్నది.
అది కాలనాగులా ఏ సమయంలో ఎలా కాటేసి కనుమరుగు చేస్తుందో తెల్వదు. ఫార్మూలా ఈ కారు రేస్ కేసు ఓ లొట్టపీసు కేసే.. అదంతా ఓ మేకపోతు గాంభీర్యం. ఎంతైనా అహంకారం ఇంకా వీడలేదు కదా. అట్లా అనకపోతే.. ఇప్పటికే అటూఇటూ ఊగిసలాడుతున్న అనుచరగణానికి ఎంతో కొంత ధైర్యం చెప్పాలె కదా. తప్పదు. అట్లనే మాట్లాడలే. ఏం మాట్లాడినా..అది జరగేది జరుతనే ఉంటదు. మనం చూస్తుండాలె. అంతే. ఫోన్ ట్యాపింగ్ వైర్లు అరికాలి నుంచి మెడ వరకు కాలనాగులా అల్లుకుపోతూనే ఉన్నాయి. అవి గట్టిగా బిగుసుకునేది ఏ సమయంలోనే చూడాలె. శ్వాస తీసుకోవడం కష్టమయిన నాడు అది చేసిన వారికి వారికి ఊపిరి ఆడటం కష్టమైననాడు మాత్రమే దానికి ఫలితం తెలుస్తుంది. జనానికీ ఆ దృశ్యం సాక్షాత్కారం కావడానికి ఎక్కువ రోజులు పట్టదు కాబోలు. ధరణి కుంభకోణం దగ్గర నుంచి గొర్రెల స్కాం దాకా.. దళితబంధు పర్సెంటీజీల పాపపు సొమ్ము నుంచి.. యంత్రలక్ష్మీ ట్రాక్టర్ల బాగోతాల దాకా.. ఒక్కటా రెండా చాలానే ఉన్నాయి.
అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీదకు వస్తుంటే.. చూస్తున్నాడ్రా పైవాడు.. అనుభవిస్తారు ఇగజూడు.. అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. ఆ కుటుంబాన్ని వదిలేలా లేదు ఆ కర్మఫలం. ఆడబిడ్డ బజార్లో దుమ్మెత్తిపోసింది. మీరు నాశనమవుతార్రోయ్ అని. శపించింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పాపం ఇప్పుడు ఇంకా అడిషనల్. మిగిలిన ఆ దుష్టత్రయానికి చేసిన పాపాల చిట్టా చుట్టూ చుట్టుకుని ఊపిరి సలపకుండా చేసేందుకు రంగం రెడీ అవుతోంది. హిందుగాళ్లూ.. బొందుగాళ్లూ.. అప్పుడు బొందపెట్టింది. ఇప్పుడు… చేసిన పాపాలకు మూల్యం చెల్లించేందుకు పాతాళానికి తొక్కేందుకు ముహూర్తం రెడీ చేసుకున్నది. ఇక మిగిలింది..ఇగ అనుభవిస్తున్నారు చూడు..! అనడమే.