వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
కాళేశ్వరం పై కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఏ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. అది కౌంటర్ కాదు.. ఎన్ కౌంటరే. జనహిత ప్రకటన అది. కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టి డిజైన్ మార్చి పిల్లర్లు కుంగిపోయేలా చేసిన కేసీఆర్ పాలనకు.. ఓ సవాల్ విసిరారాయన. ఇప్పటి వరకు చాలా మందికి ఓ డౌట్ ఉంది. సరే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఇది తేటతెల్లం. మరి దీన్ని రిపేర్లు చేస్తారా..? చెయ్యరా..? రైతులకు ఉపయోగపడేలా చేస్తారా..? గాలికి వదిలేస్తారా..? వీటన్నింటికీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కాదని తుమ్మడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి.. ఇవాళ అది కూలిపోవడానికి కారకులైంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్. బీఆరెస్ ప్రభుత్వం.
కానీ దీనికి విరుగుడు చెప్పారు రేవంత్. శాశ్వత పరిష్కారం చూపారు సీఎం. డిజైన్ మార్చి.. ప్రాజెక్టు పేరు మార్చి.. ఊరు మార్చి.. ఏమార్చి నిర్మించి ప్రజాధనానికి చెదలు పట్టించిన వైనాన్ని కళ్లముందుంచుతూనే .. తను మళ్లీ ప్రాణహిత- చేవెళ్ల పథకాన్ని పూర్తి చేసి.. ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతానన్నారాయన. మహారాష్ట్రతో సంప్రదింపులు జరిగి… కావాల్సిన అనుమతులు తీసుకుని.. ముందుగా కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్లానింగ్ చేసిందో… అదే తరహాలో పాత ప్రాజెక్టు తమ్మడిహట్టి వద్ద నిర్మించి తీరుతానని శపథం పూనారు. దీనికి శభాష్ అన్నారు జనం. ఇది కదా పాలకుడిలో ఉండాల్సిన స్పిరిట్ అని కొనియాడారు.రేవంత్ భవిష్యత్ విజన్‌ను మెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాను పూర్తిగా ఎండబెట్టి.. ఆదిలాబాద్‌ను ఆగం చేసిన పాత ప్రాజెక్టును తలదన్నేలా ప్రాణహిత చేవెళ్ల నిర్మించి చూపుతానని సవాల్ విసిరారు.