వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
అధికారం కోల్పోయామనే ఫ్రస్టేషన్ కేటీఆర్‌ను పిచ్చోడిని చేసింది. మాటకు మతి ఉండడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో తనకే సోయి లేదు. తన సోషల్ మీడియా ఇచ్చిన స్క్రిప్టును యథాలాపంగా, యథాతదంగా పలుకుతూ పలుచనవుతున్నాడు. నవ్వుల పాలవుతున్నాడు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి పేల్చారని ప్రేలాపనలు చేశాడు నిన్న మొన్నటి వరకు. ఆ తరువాత కోర్టు మెట్లెక్కి.. లేదు లేదు.. బాగా వర్షాలు పడ్డాయి.. మామూలు వర్షాలు కాదు… పే..ద్ద వర్షాల కారణంగానే పిల్లర్లు కుంగాయన్నారు. సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే…. అదేందీ.. ఎట్లా ఇస్తారు సీబీఐకి.. తూచ్.. దీన్ని మేమొప్పుకోం.. అంటాడు. చెల్లెనే స్వయంగా ఇందులో అవినీతి జరిగిందని ధ్రువీకరించిన విషయం యావత్ ప్రపంచం చూసింది. ఇప్పుడు ఇంటి పోరు పడలేక.. అధికారం చేతిలో లేక ఏం మాట్లాడాలో తెలియక… కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు.. మలన్నసాగర్ అంశాన్ని పట్టుకుని ప్రెస్‌మీట్ పెట్టాడు. ఏమంటాడు..? ..
అదేందీ… కాళేశ్వరం పూర్తిగా వృథా ప్రాజెక్టన్నరు కదా. మరి ఎందుకు మల్లన్న సాగర్ నీటిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అది మాది.. మా ఆస్తి.. జాతికి క్షమాపణ చెప్పు రేవంత్ .. అన్నాడు. అరే .. అది జనం పైసా.. జరిగిన అవినీతి నిజమే. కూలిన పిల్లర్లే సాక్షం.. మార్చిన డిజైన్లూ నిజమే. ఘోష్ కమిషన్ నివేదికా కళ్ల ముందుంది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ కూడా వేసింది. అది విచారణ జరుగుతుంది. కానీ అప్పటి వరకు దీన్ని వాడనే కూడదు. అది మా ఆస్తి.. మా పైసలతో కట్టినది అనే విధంగా కేటీఆర్ మాట్లాడమే సిగ్గు చేటు. విడ్డూరం. పనికి మాలిన మాటలు.
చెల్లె అవినీతి జరిగిందని చెబితే.. సస్పెండ్ చేశారు. జనాన్ని పిచ్చోళ్లనుకున్నారు. మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టినా బుద్దిరాలేదు. లక్ష కోట్ల వృథా అయ్యాయన కదా ఆరోపణలు. తమ్మిడి హట్టి దగ్గర కాకుండా .. మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారనే కదా మొదటి నుంచి కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నది. ఇప్పుడు పిల్లర్లు కూలినయి.. కాబట్టే విచారణ అంటున్నారు. ఆ పిల్లర్లు కూలకపోతే దాని జోలికి పోయేవారా..? కనీసం కామన్ సెన్స్ లేకుండా ఉన్నాడు కేటీఆర్. అందుకే నవ్వుల పాలవుతున్నాడు. ఉన్నపళంగా ఎన్నికలొచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి.. తను సీఎం అయితే బాగుండు అనే భ్రమలో బతికేస్తున్నాడు. వాస్తవం తెలుసుకుని, ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదని తేలిపోవడంతో ఇలా పిచ్చిపట్టునట్టు.. తలా తోక లేని .. లాజిక్‌కు అందని మాటలతో ..తనకు మతిలేదని నిరూపించుకుంటున్నాడు.