(దండుగుల శ్రీనివాస్)
దేవుడి చుట్టూ దయ్యాలున్నాయన్నది కవిత. కేసీఆర్ దేవుడే కానీ.. ఆయన ప్రతిష్టను మసకబారుస్తున్నది మాత్రం ఆ చుట్టూ చేరిన దయ్యాలేనన్నది. కానీ నిన్నటి వరకు వారి పేర్లు బయటపెట్టలె. లిల్లీపుట్ లీడర్ అని మాత్రం జగదీశ్‌రెడ్డిని అర్సుకున్నది. ఆ తరువాత కాళేశ్వరం స్కాంలో మరో రెండు దయ్యాల పేర్లు బయట పెట్టింది. హరీశ్, సంతోష్లిద్దరూ పెద్ద పైసా పిచ్చిగాళ్లని తేల్చేసింది. ఇంకా చాలా మందే అక్కడ దయ్యాల రూపంలో ఉన్నారనేది కవిత ఓపీనియన్. ఇప్పుడు వారందరి పేర్లు, జాతకాలు బయటపెట్టడమే మిగిలుంది. కానీ అందరికంటే ముందు.. అన్ని దయ్యాలకన్నా పెద్ద దయ్యం.. ఆది దయ్యం… ఆమె అన్ననే. కేటీయారే. ఆ విషయం అందరికీ తెలుసు.
కానీ ఆమె నోటి వెంట…ఆ మాట ఎప్పుడొస్తుందా..? అని చూశారంతా. కానీ ఆమె అన్న పేరును ప్రస్తావించే విషయంలో ఆచితూచి మాట్లాడింది నిన్నటి వరకు. కాళేశ్వరం కేసును సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే.. బంద్‌కు పిలుపివ్వొద్దా..? అని అన్నను పరోక్షంగా గట్టిగానే అర్సుకున్నది. ఇప్పుడు అన్నగారి బాగోతాలన్నీ బయటపెట్టనుంది. పార్టీని నాశనం చేసే కార్యక్రమాల దగ్గర నుంచి.. తండ్రి పరువును మంటగలిపే విషయం.. బీజేపీతో పొత్తుకు, విలీనానికి చేతులు కలిపి, మోకరిల్లిన అంశాలన్నీ ఏకరువు పెట్టనుంది. ఇప్పుడీ రాజకీయం రసకందాయంలో పడనుంది. లేఖ లీక్ అయిన నాడే వాస్తవం చెప్పింది. కవిత..మరో షర్మిళ కానుందని. ఇప్పుడటు వైపు అడుగులు పడుతున్నాయామెవి. పార్టీని ఓన్ చేసుకుని.. గుత్తాధిపత్యం నాదేననే రీతిలో వ్యవహరించిన అన్నపైనే అక్క ఆగ్రహజ్వాలలుండబోతున్నాయి. ఆ మంటల్లో కేటీఆర్ మాడి మసికాకతప్పదు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451