(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆయ‌న దేవుడు. తండ్రికి న‌ష్టం క‌లిగించేలా ఒక్క ప‌ని చేసినా నేను మ‌రుక్ష‌ణం చ‌చ్చిన‌ట్టే. బీఆరెస్ నాదే. కేసీఆరే మా నేత‌. ఆయ‌నే సీఎం. ఇలా రోజుకో మాట మాట్లాడినా.. కేసీఆర్‌ను కాద‌ని మాత్రం ముందుకు పోని ప‌రిస్తితి. కానీ చేసే చేష్ట‌లు, మాట్లాడే మాట‌లు మాత్రం అందుకు పూర్తి భిన్నం. పార్టీలోనే ఉంటూ క‌య్యానికి కాలు దువ్వేందుకు రెడీ అయ్యింది తాజాగా క‌విత‌.

మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి.. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో మాట్లాడుతూ క‌విత విష‌యం పెద్ద‌గా ప‌ట్టించ‌కోవ‌ద్ద‌ని లైట్ గా తీసుకున్నాడు. ఇదే ఆమెకు కోపాన్ని తెప్పించింది.వ్య‌క్తిగ‌తంగా తిట్ట‌డ‌మంటేనే మ‌న ద‌గ్గ‌ర కంటెంట్ లేద‌న్న‌ట్టు అని మొన్న‌నే ట్రైనింగ్ ఇచ్చిన క‌విత‌.. త‌నే కంట్రోల్ త‌ప్పిందిలా. అదీ బాడీ షేమింగ్‌కు పాల్ప‌డుతూ. లిల్లీపుట్ అని ప‌దే ప‌దే జ‌గ‌దీశ్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యంగ్యాన్ని జోడించి మ‌రీ తిట్టింది. న‌ల్ల‌గొండ జిల్లాలో ఎన్ని సీట్లు గెలిపించుకున్నావ్‌? నీ ఒక్క సీటే చచ్చీ చెడీ గెలిపించుకున్నావ్ క‌దా! అని దెప్పిపొడించింది. ఇక ఆమెపై ప‌డ్డారు న‌ల్ల‌గొండ బీఆరెస్ బిడ్డ‌లు. జ‌గ‌దీశ్‌రెడ్డి రాజ‌కీయ జీవిత చ‌రిత్ర‌నంతా ముందుంచారు.

కేసీఆర్‌తో ఆయ‌న‌కున్న బంధం, అనుబంధం, ఉద్య‌మ చ‌రిత్ర‌… అన్నీ అన్నీ ఏక‌రువు పెట్టారు. అవునూ.. క‌విత‌క్కా… నువ్వు రాజ్య‌మేలిన నిజామాబాద్‌లో ఎన్ని సీట్లు గెలిపించిన‌వ్‌! నిజామాబాద్ జిల్లాలో ఒక్క బాల్కొండ గెలిచింది చ‌చ్చీ చెడీ. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ గెలించింది. అదీ జంప్ అయ్యింది త‌రువాత‌. ఏమ‌న్నా అంటే వాళ్లు నా మాట విన‌లేదు. కేసీఆర్ వాళ్ల‌ను నెత్తికెక్కించుకుండు.. అని ఏదేదో కార‌ణాలు చెబుతావు గానీ, నిజామాబాద్ జిల్లానే నీ గుప్పిట్లో పెట్టుకోలేక‌పోయిన‌వ్‌… ఇక సీఎం కావాల‌నే కోరిక చాలా చాలా పెద్ద‌దే కాదా! ఇప్పుడు ఇవే నిల‌దీత‌లు, ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి.. బీఆరెస్ నుంచి. జ‌గ‌దీశ్‌రెడ్డి… కేసీఆర్‌కు ఇప్పుడు ఉన్న అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌డు క‌దా.

మొన్న‌నే ఫామ్‌హౌజ్ లో పెట్టుకున్న మీటింగులో ఉన్న ఒక‌రిద్దరిలో ఆయ‌నా ఉన్నాడు. మ‌రి ఎలా లిల్లీపుట్ అని తిట్ట‌గ‌లిగావు? ఆ తిట్టు తండ్రికి త‌గిలిన‌ట్టే క‌దా? ఇంత చిన్న లాజిక్ ఎలా మ‌రిచిపోయావ‌క్కా? లేదంటే కావాల‌నే తిట్టావా? పార్టీలోంచి మెడ‌బ‌ట్టి గ‌ట్టిగా గెంటేస్తే గానీ సింపతీ ఉండ‌ద‌నే వ్యూహ‌మేమైనా ఉందా? కేసీఆర్‌ను కాద‌ని బ‌య‌ట‌కు వెళ్ల‌లేవు. బీఆరెస్ కండువా క‌ప్పుకోలేవు. అన్న‌నే ద‌య్య‌మ‌ని ధైర్యంగా చెప్ప‌లేవు. పార్టీ కొత్త‌ది పెట్టి మ‌న‌లేవు… కాంగ్రెస్‌లోకి వెళ్ల‌లేవు…మ‌రి ఎలా? ఇన్ని క‌న్ఫ్యూజ‌న్లు పెట్టుకుని బీసీల కోసం పోరాడుతున్నానంటే మేం నీ కాళ్ల ద‌గ్గ‌ర పారాడాలా!? హౌ .. ఎలా?? ఎలా న‌మ్మేది!!

 

Dandugula Srinivas

Senior JOURNALIST

8096677451