Month: June 2025

స‌ర్కార్‌పై భ‌రోసా లేదా..? రైతుభ‌రోసాపై ప్ర‌చారం లేదు.. అంతా గ‌ప్‌చుప్‌..!! సీజ‌న్‌కు నెల ముందే పెట్టుబ‌డి సాయం ఇచ్చినా క‌ద‌లిక లేదు.. ధాన్యం సొమ్ము రైతు ఖాతాల్లో ప‌డ్డా ఆ ప్ర‌చారం చేసుకోవ‌డం లేదెందుకు..? ఎందుకంత నైరాశ్యం.. స‌ర్కార్‌పై ఇంకా సొంత వారికే న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదా..?

(దండుగుల శ్రీ‌నివాస్) అమ్మిన ధాన్యం సొమ్ము వ‌చ్చి ఖాతాల్లో ప‌డ్డ‌ది. అంతా హ్యాపీ. ఇప్పుడు వానాకాలం సీజ‌న్ చాలు కాబోతుంది. నెల రోజుల పాటు నాట్లు వేసుకుంటారు. దుక్కులు దున్న‌డం, విత్త‌నాలు వేసుకోవడం, ఎరువులు తెచ్చుకోవ‌డం, కూలీల‌కు కైకిళ్లు… ఇలా వ‌రిసాగుకు…

అగ్గిపుల్ల, కుక్క‌పిల్ల, స‌బ్బుబిళ్ల … కాదేదీ ఫోన్‌ట్యాపింగ్‌క‌న‌ర్హం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అందులో అనుమానం లేదు. అది ఉద్య‌మ‌కాల‌మైనా.. సీఎంగా ప‌రిపాల‌నైనా. బాగా ద‌గ్గ‌ర‌గా చూసిన కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు ఆయన మేక‌పోతు గాంభీర్యం. చాలా పిరికి. భ‌యం. పైసా పిచ్చి లేదు గానీ…

రాను.. నే రాను… బోధ‌న్‌కు రానూ..! మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఆ ఛాయ‌ల‌కే రానంటున్న మాజీ మంత్రి..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: రాను బొంబ‌యికి రానూ.. అన్నట్టుగా మాజీ మంత్రి, బోధ‌న్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద‌ర్శ‌న్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద అలిగిండు. అల‌క‌పాన్పెక్కి ఎవ‌రెన్ని ముచ్చ‌ట్లు చెప్పినా.. బుజ్జ‌గించి లాలించిన బుంగ మూతి వీడ‌టం లేదు. ఏహె…

మొరిగే కుక్క‌ను ప‌ట్టించుకోను..! జైలుకు పంపుడైతే ఖాయం..!!

(దండుగుల శ్రీ‌నివాస్) మొన్న సీఎం రేవంత్ పై కేటీఆర్ వాడిన బూతులు బాగానే హ‌ర్ట్ చేశాయి సీఎంను. అవును మ‌రి. అంత‌లా రెచ్చిపోయి మాట్లాడిండు కేటీఆర్. కేసీఆర్‌ను విచార‌ణ పేరుతో కాళేశ్వ‌రం క‌మిష‌న్ ర‌ప్పించుకున్న సంద‌ర్భంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కంట్రోల్…

మ‌రో ప‌దేళ్లూ మేమే..! అప్పుడు కేసీఆర్ ఇర‌వ‌య్యేండ్ల‌న్న‌డు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చూసిండ్రా..! ఎంత అహంకార‌మో. ఇంకా మార‌లేదు. ఎట్ల మాట్లాడుతున్న‌రో చూసిండ్రు క‌దా… సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు కేటీఆర్‌నుద్దేశించి. అధికారంలో ఉన్న‌ప్పుడు అంద‌రూ అంతే. కానీ ఇక్క‌డ ప్ర‌తిప‌క్షంలోకి పోయిన త‌రువాత కూడా కేటీఆర్ మార‌లేదు. అది నిజ‌మే. కానీ…

హ‌మ్మ‌య్యా.. భ‌రోసా ఏసి బ‌తికించిన‌వ్ పో…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లు ముచ్చ‌ట చెప్పుమంటే మ‌ళ్లీ మ‌ళ్లీ గ‌వే ముచ్చ‌ట్లు. అప్పులు జేసిండు పోయిండు. రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు జేసిండు. పోయిండు ఫామ్ హౌజుల ప‌న్న‌డు. ఆయ‌న నోటి నుంచి గా ముచ్చ‌ట ఎప్పుడొస్త‌దా అని ఇందామంటే.. చెప్పిందే చెప్పిండు. అరే…

పొంగులేటిపై నీళ్లు..! నెంబ‌ర్ 2 దూకుడుకు క‌ళ్లెం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పొంగులేటి శ్రీ‌నివాస్‌కు కొంత దూకుడెక్కువ‌. ప‌గ‌, ప్ర‌తీకారాల పాలూ ఎక్కువే. స‌హ‌జంగా త‌న‌ది ఖ‌మ్మం కావ‌డం, జ‌గ‌న్‌తో దోస్తానా కూడా కొంత ప్ర‌భావం చూప‌డ‌మేమో.. పైకి కామ్‌గా క‌నిపించినా.. లోప‌ల కొంత ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లాంటి వుంటాయి. కేసీఆర్, కేటీఆర్…

మ‌హేశ్ భుజాల‌పై తుపాకీ… మాట విన‌ని మంత్రుల‌పై సీఎం సూటి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాల‌న‌పై ప‌ట్టు సాధించే క్ర‌మంలో మొన్న‌టి వ‌ర‌కు వేచిచూసిన సీఎం రేవంత్‌.. ఇక త‌న‌దైన పంథాను అనుస‌రిస్తున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డానికే స‌మ‌యం ప‌ట్టింది. పార్టీలో సీఎంగా ఇమ‌డానికి, అంద‌రినీ మ‌చ్చిక చేసుకోవ‌డానికి, త‌న టీమ్‌ను ఏర్పాటు…

పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఫైర్‌..! లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల‌పై మాట్లాడినందుకు ఘాట్టిగా అర్సుకున్న మ‌హేశ్‌.. ఇట్ల మాట్లాడుడు క‌రెక్ట్ కాదు.. ప‌ద్ద‌తి మార్చుకోండి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా మారిన మంత్రుల తీరును గాడిలో పెట్టే ప‌నిలో ప‌డ్డాడు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌. ఎవ‌రి నోటి వెంట ఏం కామెంట్ వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రెప్పుడు ప్రెస్‌మీట్…

ఆహ్వానం అందినా… అక్క దూరం దూరం..! ష‌కీల్ కూతురు పెళ్లికి వెళ్ల‌ని క‌విత‌.. దుబాయ్‌లో పెళ్లి…. హాజ‌రైన ఇందూరు గులాబీ నేత‌లు.. ఇందూరు బీఆరెస్‌ ఇంచార్జిల‌తో గ్యాప్ మెయింటేన్ చేస్తున్న ఎమ్మెల్సీ..

(వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌) బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ చిన్న కూతురు వివాహం ఇవాళ దుబాయ్‌లో జ‌రిగింది. దీనికి ఎమ్మెల్సీ క‌విత‌కు ఆహ్వానం ఉన్నా ఆమె వెళ్ల‌లేదు. జిల్లాకు చెందిన ఇందూరు బీఆరెస్ నేత‌లంతా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే,…

You missed