వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
ఏ అత్యవసర వైద్య సేవలు అవసరమైనా అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ప్రాణాలరచేతిలో పెట్టుకుని హైదరాబాద్‌కు పోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. అక్కడికి చేరకముందే దారిలోనే గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో. ఇక ఇందూరు ప్రజలకు ఆ దుస్థితి లేదు. నిజామాబాద్‌లోనే అన్ని రకాల అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో విలువైన ప్రాణాలను కాపాడుతున్న వెల్నెస్ అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ఇకపై ఇవాళ్టి నుంచి ఇక్కడనే అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం లాంభనంగా ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవరం జరిగింది. ప్రముఖులు, పెద్దలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇందూరులో ఏడవ బ్రాంచ్.. వైద్యసేవలు, సదుపాయాల్లో టాప్..!
వెల్ నెస్ అడ్వాన్సుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిజామాబాదులో ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా కార్పొరేట్ హాస్పిటల్ కు ఏ మాత్రం తీసిపోకుండా, అత్యాధునిక వైద్య విధానంతో ఏడవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను యాజమాన్యంసుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, అసద్ ఖాన్, నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ల ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ , మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు , నగర శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహీర్ బీన్ హందాన్, నూడ చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించి, హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ.. మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గైనాలజీ, ఈ ఎన్ టీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కు సంబంధించిన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అతి తక్కువ ధరలతో కార్పొరేట్ వైద్యం నిజామాబాదులో అందించాలన్న సంకల్పంతో ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రముఖ వైద్యులు, హాస్పిటల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.