vastavam.in
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్ఓటి పోలీసులు, చేవెళ్ల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు పలవురు మద్యం సేవించినట్లు- గుర్తించారు. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు 22 మంది పాల్గొన్నట్లు- పోలీసులు చెబుతున్నారు. వీరిలో 10 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా ఒకరు గంజాయి సేవించినట్లు- తేలిందని తెలిపారు.
ఈ సందర్భంగా మంగ్లీతోపాటు ఆమె మేనేజర్ దున్నె మేఘరాజ్, అతని స్నేహితుడు దామోదర్‌రెడ్డి (గంజాయి సేవించిన వ్యక్తి), రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ పార్టీలో 6 ఖాళీ మద్యం సీసాలతో పాటు- 4 పుల్ బాటిళ్ల మద్యం లభ్యమయ్యాయని తెలిపారు. ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని, విదేశీ మద్యం బాటిళ్లు తీసుకొచ్చారన్న ప్రచారంలో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి సేవించిన వ్యక్తి దామోదర్
కూడా ఈ పార్టీలో తీసుకోలేదని, అంతకుముందు గంజాయి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పార్టీలో సౌండ్ అండ్ పొల్యూషన్, ఎక్సైజ్ పర్మిషన్, ఈవెంట్ పర్మిషన్ లేవని పోలీసులు తెలిపారు.
కానీ అక్కడ విదేశీ మద్యమే లేదని, గంజాయి తాగింది ఎక్కడో అయితే ఇక్కడ తాగినట్టు ప్రచారం చేయడం కరెక్టు కాదని మంగ్లీ ఓవీడియో రిలీజ్ చేసింది. ఇది పక్క రాజకీయ కోణంలో జరిగిన దాడిగానే చూస్తున్నారంతా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకున్న ఆ వేడుకలో గంజాయి, డ్రగ్స్ వాడే చాన్స్ లేదని మంగ్లీ వెల్లడిస్తోంది. తనకు నిజంగానే పర్మిషన్ తీసుకోవాలని అవగాహన లేదని చెప్పుకొచ్చింది.