(దండుగుల శ్రీనివాస్)
లేఖ రాసింది ఆమే. నిలదీసిందీ ఆమే. ప్రశ్నించిందీ ఆమెనే. డ్యాడీ నువ్వో ఫెయిల్యూర్ లీడర్ అని తేల్చి చెప్పిందీ ఈ బిడ్డే. ఇంతలా చేసిందంటే.. అంతకు ముందు ఎంత కసరత్తు చేసి ఉండాలె. ఎన్ని ఆలోచించి అడుగు వేసి ఉండాలె. తన భవిష్యత్తుకు వేరు కుంపటి పెట్టేందుకు ఎంత మందిని కలిసి ఉండాలె. ఎంతమందితో డిస్కషన్ చేసి ఉండాలె. సమయం రాగానే లేఖ రూపంలో ఫ్రీలర్ వదిలి .. ఇప్పుడు అది అంతర్గత లేఖ.. దాన్ని బయటపెట్టారు..! కేసీఆర్ దేవుడే కానీ, చుట్టూ దెయ్యాలున్నాయి..! ఏమేమో అంటూ డ్రామా ప్లే చేస్తోంది కవితక్క. కాదు కాదు.. షర్మిలక్క.
అవును. ఆమె పార్టీ పెట్టడం ఖాయమైంది. దానికి బీసీలను పునాది చేసుకోనున్నది. ఇంకా ఏడాది తరువాత కావొచ్చు. కానీ పక్కా. అప్పటిదాక ఇట్ల ఆ పార్టీలోనే ఉండి. బలోపేతం చేద్దాం.. కేసీఆరే దిక్కు. తెలంగాణను ఆయనే పాలించగలడు.. అని ఏవేవో ముచ్చట్లు చెబుతూనే తన పని తాను కామ్ చేసుకుంటూ పోతుందన్నమాట. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించుడన్నమాట. అవునూ.. ఇంతకీ ఆ దెయ్యాలెవరై ఉంటారు. కేటీఆర్ ఒక దెయ్యం. హరీశ్ ఇంకో దయ్యం. సంతోషరావు మరో దయ్యం. ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనే బడే మరో రెండు ఆస్థాన దయ్యాలు.
మరి నీ దగ్గర ఎన్ని దయ్యాలున్నాయ్ అక్కాయ్..! కేటీఆర్ దగ్గర దయ్యాల సంఖ్య ఎంత..? అసలు మీ కుటుంబంలో మొత్తం దెయ్యాల సంఖ్య ఎంత..? అందులో కొరవి దయ్యాలెన్ని..? కోట్లకు పడగలెత్తిన దెయ్యాలెన్ని…? జనాల ఉసురు తీసిన దయ్యాలెన్ని..? ఉద్యమం పేరుతో వాడుకుని జీవితాలు రోడ్డున పడేసిన దెయ్యాలెన్ని..? మరి ఈ ముచ్చటకొస్తే మొత్తం దయ్యాలె కనిపిస్తున్నాయి… మరి దేవుడెక్కడున్నాడు..?