(దండుగుల శ్రీనివాస్)
దామోదర రాజనర్సింహను కూడా ఇలాగే అన్నారు. తాగి మాట్లాడతాడని. ఇప్పుడు కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డికీ అదే ముద్ర వేసేందుకు ప్రయత్నించి భంగపడింది బీఆరెస్. అసెంబ్లీలో హరీశ్ రావు కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాగే అలవాటున్న ఎవరైనా తాగి ఇంట్లో పంటడు కానీ, ఇలా అసెంబ్లీకి వచ్చి చిల్లర కాడు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. అది హరీశ్‌రావుకూ తెలుసు.
కానీ తాగుబోతులు అని ముద్రవేసే ప్రయత్నం చేసి భంగపాటుకు గురయ్యాడు. అది కేసీఆర్ మెడకే చుట్టుకున్నది. అసెంబ్లీలో తాగుబోతుల చర్చ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశం వ్యాప్తంగా కలకలం రేపింది. తెలంగాణ రాజకీయాలను ఇక్కడి రాజకీయ నాయకులు మరింత భ్రష్టు పట్టించారనడానికి ఇదో తాజా ఉదాహరణ. బీపీ ఉండటం, వారి మాటలో స్పష్టత లోపించడం సహజంగా మాటలో తడబాటు కనిపిస్తుంది. అదే వీరిద్దరిలోనూ ఉంది. అందుకే అప్పుడు దామోదరను తాగుబోతును చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు టార్గెట్ కోమటిరెడ్డి.