(దండుగుల శ్రీనివాస్)
నమస్తే తెలంగాణ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. గత మూడు నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి. మధ్యలో వాస్తవం మీడియా రాసిన వార్తలకు కదిలిన కేటీఆర్ జీతాలు ఇప్పించాడు. ఇప్పుడు ఈ నెల మళ్లీ అదే పరిస్థితి. ఎనిమిదో తారీఖు వచ్చినా ఇంకా జీతాల ఊసులేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. ఎప్పడిస్తారో అర్థం కాని పరిస్థితి. మరీ అంత దరద్రంలో ఉన్నాడా కేటీఆర్..? సోషల్ మీడియా సోకులో పడి నెలకు కోటి రూపాయల వరకు వెచ్చిస్తున్న కేటీఆర్‌కు నమస్తే తెలంగాణ మీద గురి లేనట్టుంది. నమ్మకం సడిలినట్టుంది. అదంతా స్వయంకృతాపరాధమే. ఎడిటర్ కృష్ణమూర్తికి మొత్తం బాధ్యతలు అప్పగించారు.
పేనుక పెత్తనమిస్తే నెత్తంతా కొరిగినట్టు మొత్తం కృ.తి భ్రష్టు పట్టించేశాడు. ఇతన్ని మార్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కేటీఆర్ ఇక దాన్ని పట్టించుకోవడమే మానేశాడు. ఇప్పటికీ నమస్తే తెలంగాణ ఉద్యోగులకు జీతాలు రాలేదు. ఎప్పుడొస్తాయో కూడా తెల్వదు. మరో వైపు కేటీఆర్ రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి నీతి సూత్రాలు బోధిస్తూ ఉంటాడు.