(దండుగుల శ్రీనివాస్)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తను సర్కార్‌లో నెంబర్ టూగా చెలామణి అవుతున్నాడు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ మంత్రికి.. కేటీఆర్ లాగే కొంత అత్యుత్సాహం ఉన్నట్టుంది. ఈ వైఖరి సీఎం రేవంత్‌కు కూడా నచ్చనట్టుంది. ఎక్కడో సియోల్‌లో పర్యటన.. అసందర్భంగా విలేకరులతో నోరుజారే కామెంట్లు. దీపావళి ముందే రాజకీయ బాంబులుంటాయంటూ తనకు తాను తగ్గించుకునే ప్రయత్నం. మొత్తానికి దీపావళి ముందు ఏం జరగలే. ఆ తరువాత కూడా ఏం జరగలే. ఇప్పుడు ఫార్మూలా- ఈ రేసు గురించి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ముందుకు పోతున్నాడు.
దీన్నే ఇప్పుడు పొంగులేటి మళ్లీ తన దైన శైలిలో కొత్త రాగం అందుకున్నాడు. మామూలు బాంబులు కాదు.. ఇక ఆటంబాంబులు పేలుతాయంటూ ప్రేలాపన చేశాడు. అవును.. పేలే సమయానికి అవి పేలుతాయి కానీ.. ముందే ఎందుకు దీని గురించి లీకేజీలు ఇవ్వడం.. ఎందుకు పలుచన కావడం… ఉన్న ఇజ్జత్ ఎందుకు తీసుకోవడం…? స్వయంగా రేవంత్ కూడా దీపావళికి ముందు బాంబుల గురించి లైట్ తీసుకున్నాడు. మేమెవరిపై వ్యక్తిగత కక్ష సాధింపు చేయడం లేదన్నాడు. చట్టం తనపని తాను చేసుకుంటుందన్నాడు. కానీ ఇక్కడ అందరికీ ఆటలో అరటి పండులా మారింది మాత్రం పొంగులేటే.