(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్‌కు ఇవాళ అన్నీ చెడు శకునాలే. ఏం చేద్దామన్నా అన్నీ ఎదురుతన్నాయి. పొద్దున ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆటో వాలాల ధర్నాకు పోతే అక్కడ చేదు అనుభవమే ఎదురయ్యింది. నిన్నెవడు రమ్మన్నాడంటూ ముఖం పట్టుకునే అడిగేసరికి ఏదో మాట్లాడి అయిందనిపించాడు. ఇక రాహుల్ గాంధీ కులగణన గురించి ఏర్పాటు చేసిన సమీక్షకు వచ్చిన విషయం తెలిసింది. ఇది పూర్తి కాగానే ఆయనకు అలవాటు ప్రకారం ఇక్కడి హోటల్‌లో భోజనం చేస్తాడని ఎవరో లీకులిచ్చారట.
అంతే వెనుకాముందు ఆలోచించకుండాఅతడు సినిమాలో మహేశ్‌బాబును కొట్టేందుకు బ్రహ్మాజీ ఏర్పాటు చేసుకున్న రౌడీ టీంల బావర్చి దగ్గర ఓ నలుగురిని, ప్యారడైజ్ దగ్గర ఓ నలుగురు బీఆరెస్ టీమ్‌ను పెట్టి నిరుద్యోగులు రాహుల్‌ను అడ్డుకున్నారని చెప్పేందుకు డ్రామాను రచించాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. రాహుల్ గాంధీ వచ్చింది కేవలం కులగణన మీటింగుకు మాత్రమే. ఆయన అక్కడి నుంచి నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునే వచ్చాడు.
ఇదంతా తెలియని కేటీఆర్ ఎవరో లీకులిచ్చారని పోలోమని ఇలా తన టీమ్‌తో ఏదో చేద్దామనుకున్నాడు. తన ప్లాన్ బెడిసి కొట్టడంతో తమ టీమ్‌తో కలిసి ఎంచక్కా అక్కడే పారాడైజ్‌లో ఇలా భోజనం చేసి ఆకలి తీర్చుకున్నారు. ఇదన్నమాట రామన్న డైరెక్షన్.