వాస్తవం- బాన్సువాడ:

పోచారం భాస్కర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే బాన్సువాడలో గెలవడని, అంత సీన్‌ లేదని కాంగ్రెస్‌ లీడర్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి కామెంట్‌ చేశాడు. ఆయన వాస్తవం ప్రతినిధితో మాట్లాడాడు. పోచారం కాంగ్రెస్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనను పలకరించగా.. కాంగ్రెస్‌ పార్టీ వీరినే కాదు.. అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నదని, తాను మత్రం బాన్సువాడను వదిలి వెళ్లేది లేదని, ఇక్కడే ఉంటానని అన్నారు.

భాస్కర్‌రెడ్డికి బాన్సువాడ అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నది కదా అని అడగగా… ‘ టికెట్‌ ఇస్తే గెలవాలి కదా..’ అని వ్యంగ్యంగా మాట్లాడాడు.

 

You missed