దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలదన్నెలా నడుస్తోంది నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ వ్యవహారం. చివరకు బీసీకే ఈ సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. మొత్తం రెడ్ల సంఖ్య పెరిగిపోవడంతో నిజామాబాద్ బీసీకి ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆరెస్ రెండూ మున్నూరుకాపులకు డిక్లేర్ చేసేశాయి. కాంగ్రెస్ కూడా బీసీ జపమే చేస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మున్నూరుకాపుల తరువాత పద్మశాలీ కులస్తల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఈ సామాజికవర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారు.
ఈరవత్రి అనిల్‌కు కార్పొరేషన్ చైర్మన్‌తో సరిపెట్టారు. ఇప్పుడు ఎల్ రమణపై నజర్ పెట్టాడు సీఎం రేవంత్. ఎమ్మెల్సీగా ఉన్న ఎల్ రమణకు గాలం వేస్తున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జీవన్‌రెడ్డి పేరును అధిష్టానం సీరియస్‌గా పరిశీలించినా.. ఓడిన నేతలకు టికెట్ ఇవ్వొద్దని ఏఐసీసీ వర్గాలు బలంగా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో జీవన్‌రెడ్డికి చాన్స్ మిస్సయినట్టే. ఇక కొత్తగా డాక్టర్ కవితారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమె పార్టీలోకి రావడం, పోటీ చేయడం ఈ క్లిష్ట, పోటీ తీవ్రంగా ఉన్న వాతావారణంలో సరైన నిర్ణయం కాదని కింది క్యాడర్ వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.
దీంతో రెడ్ల కార్డు వదిలేసి..బీసీ కార్డు పట్టింది అధిష్టానం. ఎల్ రమణను బీఆర్ఎస్ నుంచి పోటీ దింపాలనుకున్నారు తొలత. కానీ బాజిరెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు అదే ఎల్ రమణ కాంగ్రెస్ క్యాండిడేట్ కానున్నాడు.