ప్రష్టేషన్ తగ్గలే.. మనిషి మారలే..
తప్పు తెలుసుకోలే… జనాలను భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా…
నల్లగొండ సభలో జనాలపై తనదైన శైలి ఆగ్రహాన్ని ప్రదర్శించిన కేసీఆర్…
నాలుగేండ్లు రెస్టు తీసుకోవాలనుకున్నానంటూ పలాయనవాదం..
ఊపునివ్వని కేసీఆర్ సభ.. ఉసూరుమనించిన స్పీచ్…
(సభను ఉర్రూతలూగించి పార్టీకి జవజీవాలను తీసుకొస్తాడనుకుంటే.. చికాకు, ప్రష్టేషన్, అహంకారపూరిత, సమర్థింపు మాటలతో మరింత నిరుత్సాహపరిచి నీరుగార్చాడనే కామెంట్లు మూటగట్టుకున్నాడు కేసీఆర్ నల్లగొండ సభ సాక్షిగా..)
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి:
అవే ప్రస్టేషన్ మాటలు.. అహంకారపూరిత దోరణి.. తమను అధికారానికి దూరం చేశారనే కోపం.. వెరసి కేసీఆర్ మారలేదు. మనిషి మాట తీరూ మారలేదు. సరిగ్గా ఎన్నికల ముందు ప్రచార సభలో ఆయన సభలకు హాజరైన జనాలను ఇస్టమొచ్చినట్టు తిట్టాడు. కార్యకర్తలపై నోరు పారేసుకున్నాడు. హౌలాగాండ్లా అంటూ అహంకారపూరిత మాటలతో పలుచనయ్యాడు. ఇగో ఇప్పుడ అధికారం పోయి.. ఇంతకాలానికి కూడా అతని తీరులో ఏమాత్రం మార్పు కనిపించలేదు. కృష్టా జలాల్లో తెలంగాణ వాట కోసమంటూ నల్లగొండలో పెట్టిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన దాదాపు అరగంట స్పీచ్‌లో పరిణతి లేదు. అధికారానికి దూరం చేశారనే దుగ్ద తప్ప. ఏకంగా మళ్లీ జనాలను తప్పుబట్టాడాయన. ‘మీరు భ్రమల్లో ఉండి గెలుపించుకున్నారం’టూ తన కడుఎరపులోని ఆవేశాన్ని ఇలా వెళ్లగక్కాడు.
అధికారికి దూరం చేసి ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెబుతూనే ‘ ఓ నాలుగేండ్లు రెస్ట్ తీసుకుందామనుకున్నా..’ అంటూ పలాయనవాదాన్ని బయటపెట్టుకున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే విశ్రమించాలా..?… ఎన్నికల ప్రచార సభలో కూడా ఇలాగే బెదిరింపు దోరణిలోనే కేసీఆర్ స్పీచ్ కొనసాదింది. ‘మేం ఓడిపోతే మాకు పోయేదేమీ లేదు. ఫామ్ హౌజ్లో రెస్ట్ తీసుకుంటా..! మీకే నష్టం..!’ అంటూ జనాలను బెదిరించాడు. సిట్టింగుల దౌర్జన్యాలు, అన్యాయాలు, అవినీతి జనాలను విపరీతంగా బాధపెడుతున్నా.. వారిని మార్చే ధైర్యం చేయని కేసీఆర్… ఇలా ఇప్పుడు సభ పెట్టి మరీ జనాలను బెదిరించడం.. వారిదే తప్పని వాదించడం.. ఆయనలోని లోపాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో భాగమే. కాలు విరగ్గొట్టుకుని ఇక్కడి వచ్చా.. అని ఆయన సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేసినా.. మధ్యమధ్యలో మైకు గురించి, సౌండ్ గురించి చికాకు పడటం, తిట్టడం, చీదరించుకోవడం…అసహనానికి గురికావడం.. జనాలకు దగ్గర చేయకపోయింది. ఉన్న సానుభూతిని కూడా కేసీఆర్ వ్యవహారతీరు పోగొట్టుకుంది.
ఉద్యమాభివందనాలంటూ మొదలుపెట్టిన కేసీఆర్… మరి పదేళ్లలో ఉద్యమకారులకు నువ్విచ్చిన గుర్తింపేదీ…? పదవులేవీ..? ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ గుర్తొచ్చిందా….? జనాలను పిచ్చోళ్లలాగా, అమాయకుళ్లా…. భావించి మాట్లాడే అహంకారపు మాటలకు తగిన బుద్ది చెప్పారనే విషయాన్ని కూడా కేసీఆర్ విస్మరించాడు. ఆ హుందాతనం లోపించింది. ఇన్నేండ్లు సీఎంగా చేసిన కేసీయారేనా ఇలా మాట్లాడుతున్నది అనేలా… మరీ దిగజారుడుగానే ఉంది ఆయన ప్రవర్తన. ‘మేడిగడ్డ.. మీ బొందలగడ్డ..’ అంటూ మితిమీరిన తన అసహనాన్ని ప్రదర్శించి మరీ పలుచనయ్యాడు కేసీఆర్. ‘అవును… పిల్లర్లు కుంగినాయి… కుంగుతాయి..’ అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసినా అది వేదికమీదున్న నాయకులకే నచ్చినట్టు లేదు. ముఖాలు అదోలా పెట్టుకున్నారు. ‘మీరే పాలించండి.. ఈ నాలుగేళ్లు మిమ్మల్ని ఏమనం..’ అని అన్నాడు. మిగిలన నాయకుల్లాగా మీరు ఇంకా ఎక్కువ రోజులుండరు.. అని మాత్రం అనలేదు. అలా అంటే మరింత పాతాళంలోకి పడిపోయేవాడే కేసీఆర్. ‘రైతుబంధు ఇవ్వ చాతకాదా..? అడిగితే చెప్పుతో కొడతామంటారా..?’ అని నిలదీసే ప్రయత్నం చేసిన కేసీఆర్ మాటలకు అంతగా స్పందన రాలేదెందుకో…?
ఒక్కటి మాత్రం మళ్లీ రూఢీ అయ్యింది. కేసీఆర్ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతాడని. వరికి మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరంట సోషల్ మీడియాలో చదవిన.. అంటూ తన స్థాయిని తగ్గించుకున్నాడాయన. రైతుబంధుకు డబ్బుల్లేవని చెప్పొచ్చు కదా అని అదో తలకుమించిన భారమైన పథకమని తనకూ ఎంతో కష్టమయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెప్పుకున్నాడు గులాబీ బాస్. అసెంబ్లీలో జనరేటర్ పెట్టుకున్నారని కేసీఆర్ సంధించిన అస్త్రం గురితప్పింది. పెద్దగా టార్గెట్ రీచ్ కాలేదు. మొత్తానికి సభయావత్తు నిరుత్సాహాన్నే నింపింది క్యాడర్‌లో. ‘తెలంగాణ తెచ్చిన నన్నే తిరగనియ్యరా.. చంపుతారా.. రా దమ్ముంటే..!’ అనే మాటలతో హుందాతనాన్ని కోల్పోయి రెచ్చగొట్టే విధానమే మేలని డిసైడ్ అయినట్టుగా జనాలు గ్రహించారు. అందుకే ఆ మాటలకు ఈలలు వినిపించలేదు. సైలెంటు చూపులే కనిపించాయి. ‘మీలాగా మేం మళ్లీ అధికారంలోకి రాగానే ఇట్లనే కక్షపూరితంగా వ్యవహరించాలా..!’ అంటూ బెదిరింపు దోరణి మాటలు పెద్దగా క్లిక్ కాలేదు. సభను ఉర్రూతలూగించి పార్టీకి జవజీవాలను తీసుకొస్తాడనుకుంటే.. చికాకు, ప్రష్టేషన్, అహంకారపూరిత, సమర్థింపు మాటలతో మరింత నిరుత్సాహపరిచి నీరుగార్చాడనే కామెంట్లు మూటగట్టుకున్నాడు కేసీఆర్ నల్లగొండ సభ సాక్షిగా.
DANDUGULA SRINIVAS
(SENIOR JOURNALIST)
8096677451