దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: చేసిన పాపాలు ఊరికే పోవంటారు. ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటాయి.ఓ వైపు వ్యతిరేక శక్తులు షకీల్‌ను తొక్కినార తీసేందుకు సమయం కోసం ఎదురుచూస్తుండగా… తనే వెళ్లి వారి చేతికి చిక్కి ఇలా పొలిటికల్ బ్లాక్‌లిస్టులోకి వెళ్లిపోయాడు. ఈ కథంతా బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఓడిన వెంటనే అతన్ని పాపాలు వెంటాడాయి. కొడుకు ఇచ్చిన ‘సన్ స్ట్రోక్’ అతన్ని బోధన్‌కే కాదు.. శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేసింది.

పంజాగుట్టలో కారు యాక్సిడెంట్ చేసి దొరికిపోయిన కేసులో షకీల్‌ కొడుకు రాహిల్‌ను తప్పించేందుకు పెద్ద ఎత్తున చేతులు మారాయి. అక్కడ సీఐను బోధన్ టౌన్ సీఐగా పనిచేసిన ప్రేమ్కుమార్‌ ఏమార్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు. ఆ తరువాత అడ్డంగా దొరికిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నది. పోలీసులపై కొరఢా ఝుళిపించింది. దీంతో కొడుకుతో దుబాయ్‌ పారిపోయాడు షకీల్‌. ఇవాళ షకీల్‌ను వెంటాడి వెతికి పట్టుకునేందుకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా పెను ప్రకంకపనలు సృష్టించింది. ఈ కేసులో షకీల్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదకుండా మరింత ఒత్తిడి పెంచి సఫలమయ్యారు బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ లీడర్‌ తూము శరత్‌రెడ్డి.

షకీల్‌ ఓటమి పాలైన తరువాత వరుస దాడులు చేయించాడుశరత్‌. షకీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అక్రమ రైస్‌మిల్లింగ్‌ ఆట కట్టించాడు. ఇక కబ్జాల బాగోతంపై పడే క్రమంలోనే షకీల్‌ కొడుకు రాహిల్‌ కారు యాక్సిడెంట్ కేసు వీరికి అందివచ్చిన అవకాశంగా దొరికింది. షకీల్‌ను పొలిటికల్‌గా పూర్తిగా బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు.బోధన్‌ బీఆరెస్‌లో ఈ పరిణామం ఆగమాగం చేస్తోంది. ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్‌కు బోధన్‌ పూర్తి మైనస్‌లో పడిపోయింది. త్వరలో కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రజాపాలనంటే ఇదే.. అక్రమార్కులను ఎవరినీ వదలం.. బోధన్‌కు పట్టిన శని వదలింది..

– ప్రమోద్‌ చిన్నా, కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి

ప్రజాపాలనకు ఇది నిదర్శనం. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి బోధన్‌లో అరాచకశక్తిగా ఎదిగిన షకీల్‌కు ఇది చెంప పెట్టులాంటి గుణపాఠం. ప్రభుత్వం తీసుకున్న లుక్‌ అవుట్ నోటీసుల నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజలంతా ఈ నిర్ణయం పై హర్శిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని అక్రమాలకైనా పాల్పడతామని విర్రవీగే నాయకులకు, పోలీసులకు ఈ కేసు ఓ గుణపాఠం కానుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఇలాంటి నేతలను, అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభీష్టమే ప్రజాప్రభుత్వ కర్తవ్యం.

You missed