దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ ఎంపీగా ఎవరికి టికెట్‌ ఇవ్వాలనేదానిపై క్లారిటీ వస్తోంది. ఇవాళ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్పారెడ్డి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ ప్రెసిడెంట్‌ మానాల మోహన్‌ రెడ్డి, సీరియర్‌ నేత తాహెర్ బిన్ హందాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్యే ప్రధానంగా టికెట్‌ పోటీ కొనసాగుతున్నది. ఈరవత్రి అనిల్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నాడు.

జీవన్‌రెడ్డికి కాదంటే కచ్చితంగా టికెట్‌ నాకే అని చెప్పుకుంటున్నాడు అరికెల. సునీల్‌ రెడ్డి పేరు ప్రచారంలో ఉన్నా తన వద్ద డబ్బులు లేవని, తనకు ఇంట్రస్ట్‌ లేదని అధిష్టానానికి చెప్పేశాడు. మానాల మోహన్‌రెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మరోవైపు ఈ టికెట్ ఇందూరుకే కేటాయించాలనే వినతులు అధిష్టానానికి వెళ్తున్నాయి. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇందులో ఐదు ఇందూరువే. దీంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తే పోటీ బలంగా ఇచ్చి గెలిచే అవకాశాలుంటాయని జిల్లా పార్టీ నేతలు భావిస్తున్నారు. అధిష్టానం ఈ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిన నేతలకు టికెట్ ఇవ్వొద్దనే ఈ పార్టీ పాలసీని గట్టిగా అమలు చేస్తే జీవన్‌రెడ్డి రేసులో వెనుకబడే అవకాశం లేకపోలేదు. నాలుగైదు రోజుల్లో ఎవరికి టికెట్‌ దక్కనుందో క్లారిటీ రానుంది.

You missed