దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: వినయ్‌రెడ్డి షాడో ఎమ్మెల్యే రాజకీయం ఆర్మూర్‌ను మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వార్తల్లో కేంద్ర బిందువుగా మార్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పైడి రాకేశ్‌రెడ్డి గెలిచినా.. పెత్తనమంతా వినయ్‌రెడ్డే చేస్తున్నాడు. అధికారులకు, పోలీసులకు ఇప్పటికే హుకుం జారీ చేయడంతో వారంతా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ఎమ్మెల్యే వారికి అండగా నిలబడటంతో వీరు వినడం లేదని ఏకంగా మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ఆర్మూర్‌లోని అధికారులతో మీటింగు పెట్టించి వార్నింగ్‌ ఇప్పించాడు వినయ్‌.

ఇదే విషయాన్ని వాస్తవం డిజిటల్‌ న్యూస్‌లో ‘ మంత్రి కాకముందే మంత్రాగాలు’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది జిల్లాలో కలకలం రేపింది. దీనిపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే గురువారం సెక్రటేరియట్‌కు వెళ్లి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్టారావుతో మొరపెట్టుకున్నాడు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జోక్యం తన నియోజకవర్గంలో ఎందుకు..? అని నిలదీశాడు. ఇలా అయితే తాను రాజీనామా చేస్తానని వార్నింగ్‌ ఇవ్వడంతో ఖంగుతినడం జూపల్లి వంతైంది. పనిలో పని అక్కడి నుంచే సుదర్శన్‌రెడ్డికి కూడా ఫోన్‌ చేసి బాగానే అర్సుకున్నాడు రాకేశ్‌.

‘నువ్వు ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. నేనూ నీలాగే ఎమ్మెల్యేను. నువ్వు ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు.. నేనేమైనా తప్పుడు పనులు చేస్తున్నానా..? ఎవరినైనా బెదిరస్తున్నానా..?’ అని ప్రశ్నించాడు. అంతేకాదు..’ ఇలా తగుదునమ్మా అని మా నియోజకవర్గ విషయంలో జోక్యం చేసుకుంటే నీ పేరు మీద ఆమరణ నిరాహారదీక్ష చేస్తా ఖబడ్దార్‌..’ అంటూ ఓ వార్నింగ్‌ కూడా ఇచ్చేయడంతో.. సుదర్శన్‌రెడ్డికి చల్లటి చెమటలు పట్టాయట. ‘ వద్దురా బాబు.. అలా చేయకు.. నేనం జోక్యం చేసుకోనులే..’ అని బాబ్బాబ్బాబు అని బతిమాలుకునేదాకా వచ్చిందట పరిస్థితి. విషయం సీరయస్‌గా మారుతుండటంతో ఇన్చార్జి మంత్రి మధ్యవర్తిత్వం వహించి.. శనివారం మీటింగు పెట్టి మాట్లాడుతానని సముదాయించి చెప్పి పంపాడట. ఇదీ జరిగిన సంగతి..

You missed