దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

నిజామాబాద్‌ పార్లమెంట నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్‌ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను మాత్రమే కేటీఆర్‌ మాట్లాడించారు. బిగాలకు, జీవన్‌ రెడ్డికి ఆ చాన్స్‌ ఇవ్వలేదు. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బదులు ఆయన సతీమణి హాజరయ్యింది.

ఆమెకూ చాన్స్‌ ఇవ్వలేదు. ఓడిన ఎవ్వరికీ చాన్స్‌ ఇవ్వకపోగా.. బాజిరెడ్డికి మాత్రమే అవకాశం ఇవ్వడం చర్చకు దారి తీసింది. మరోవైపు హాజరైన లీడర్ల నుంచి జిల్లా అధ్యక్షుడిని మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. ఇంకొందరు ఎమ్మెల్యేలకు అధ్యక్ష పదవి ఇవ్వొద్దనే వాదనా వినిపించింది.

You missed