హైదరాబాద్:
అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డినీ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న చికిత్సపై ఆరా తీసిన మంత్రి, మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
బీఆరెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ లీడర్ ఈగ గంగారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హై బీపీ కారణంగా ఆయనకు పెరాలసిస్ అటాక్ అయింది. మెదడులో చిన్నగా బ్లడ్ క్లాట్ కావడంతో పక్షవాతం వచ్చినట్టుగా డాక్టర్లు గుర్తించారు. ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స అందుతున్నది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కొద్ది రోజుల్లో ఆయన కోలుకుంటారని కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు గంగారెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు. గంగారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడం పట్ల జిల్లా బీఆరెస్ శ్రేణులు షాక్‌కు లోనయ్యారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు.