శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. సోమవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. 65 వేల క్యూసెక్కుల వరకు వరద రాక పెరగడంతో సోమవారం రాత్రి 25 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మంగళవారం వేకువ జాము నుంచే వద ఉధృతి వేగంగా పెరుగుతూ 114038 క్యూసెక్కులకు చేరడంతో అదే 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదలను 99920 క్యూసెక్కులకు పెంచారు.

సాయంత్రానికి వరద రాక 64038 క్యూసెక్కులకు తగ్గడంతో నీటి విడుదలను 16 గేట్ల ద్వారా 49990 క్యూసెక్కులకు తగ్గించారు. వరద కాలువ ద్వారా 5000, ఎస్కేప్ గేట్ల ద్వారా జెన్కోకు 5000, కాకతీయ కెనాల్ ద్వారా జెన్కోకు 3000, సరస్వతీ కాలువ ద్వారా 300, మిషన్ భగీరథ కోసం 152 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

You missed