మాజీ ఎంపీ మధుయాష్కీ ఇందూరు రాజకీయాలకు రాం.. రాం అంటున్నాడు. ఇక ఇక్కడ్నుంచి పోటీ చేసేదే లేదని డిసైడ్ అయిపోయాడు. తనకు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఇచ్చినా.. రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చింది ఇందూరే. నిజామాబాద్ ఎంపీగా ఆయన రాజకీయ తెరంగేట్రం చేసి గెలిచాడు. ఆ తర్వాత కూడా పార్టీ టికెట్ ఇచ్చినా కాడెత్తేశాడు. అర్వింద్ గెలుపు కోసం తను సైలెంట్ అయ్యాడు. దీంతో సంప్రదాయక ఓటు బ్యాంకును కూడా పోగెట్టేసి పార్టీని వదిలేసి.. జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నాడు. అయితే గాంధీ భవన్‌లో అతనికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాడు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అతన్ని ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించవద్దని నాన్ లోకల్ అంటూ విమర్శలు వచ్చాయి. దీంతో మధుయాష్కీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తను పుట్టింది, చదివింది ఇక్కడే వివరించాల్సి వచ్చింది. ఈ పోస్టర్ల వెనుక సుధీర్‌రెడ్డి హస్తం ఉందని కూడా ఆరోపించాడు.