నీల్ ఆంస్ట్రాంగ్ మొదటివాడు మాత్రమే…అతను కాక, ఇంకో 12 మంది అమెరికన్ ఆస్ట్రోనాట్లు చంద్రునిమీద అడుగుపెట్టి నడిచారు. అక్కడి దుమ్ములో ఆడుకున్నారు. అక్కడ చిన్నపాటి కార్లలాంటి వెహికల్స్ ని నడిపారు. అందరు క్షేమంగా భూమిమీదకు తిరిగి వచ్చారు. వస్తూ,వస్తూ కేజీలకొద్దీ అక్కడి రాల్లు,మట్టి ఎత్తుకొచ్చారు.వాటిమీద పరిశోధనలు కూడా జరిగాయి. అవి ఇంకా అమెరికన్ ప్రయోగశాలల్లో భద్రంగ ఉండేఉంటాయి.
ఇదంతా యాభై ఏళ్ళక్రితమే జరిగింది. తర్వాత అమెరికా, ఈ ప్రయోగాల్ని ఆపేయడానికి ఏకైక కారణం – “ఏమాత్రం ఉపయోగం లేని దానికి అంత ఖర్చుపెట్టడం దండగ”- అనే. ఇదంతా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారమే..డైరెక్ట్ గా నాసా వెబ్సైట్ లోనే చదువుకోవచ్చు. ఆ 12మంది ఆస్ట్రోనాట్ల పేర్లు, వాల్ల జాతకాలన్నీ దొరుకుతాయి.
చంద్రయాన్-3 అక్కడి మట్టిమీద ఏవో ప్రయోగాలు చేస్తుందనీ, అక్కడ సిలికాన్,గిలికాన్ అని ఏవో కెమికల్స్ ఉన్నాయని.. అవన్నీ భూమిమీదకు తెస్తే ఇండియాకు లక్షల కోట్లు వచ్చిపడ్తాయనీ.. విశ్వగురువు ఖావడం ఖాయమేననీ..చివర్లో “జై మోడీ” అనీ కథలుకథలుగా వర్ణించే యూటూబ్ వీడియోలు వందల్లో ఉన్నాయి. ప్రతివీడియోకూ లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. వీడియో మొత్తం చూసి చివర్లో “జై మోడీ” అని తన్మయత్వంతో ఊగిపోయే బత్తాయి గాళ్లను చూసి దేనితో నవ్వాలో అర్ధం కావడం లేదు..
– Mahammad Haneef