బ్రేకింగ్‌ న్యూస్‌.. ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ శుభావార్త చెప్పనున్నారు. నేడు ఎమ్మెల్యే అభ్యర్థలు జాబితా ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటల తరువాత ఆయన జంబో జాబితాను విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అందరికీ అవకాశం కల్పిస్తున్నారు సీఎం కేసీఆర్‌. తొలత కొందరిని మార్చుతారనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.

కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… నిజామాబాద్‌ జిల్లాలలోని ఐదు, కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న సిట్టింగులకు ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వనున్నారు కేసీఆర్‌. బాల్కొండ నుంచి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి బిగాల గణేశ్‌ గుప్తా, బోధన్‌ నుంచి షకీల్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి బాజిరెడ్డి గోవర్దన్‌లకు అవకాశం దక్కింది. కామారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి నియోజవకర్గం నుంచి గంప గోవర్దన్‌ ఫైనల్ అయ్యాడు. తొలత ఇక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని అంతా ప్రచారం చేశారు. అధిష్టానం కూడా ఓ ఆలోచన చేసింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారాయి.

ఇక్కడ నుంచి మూడోసారి బీసీ అభ్యర్థిగా గంపనే బరిలోకి దిగనున్నారు. ఎల్లారెడ్డి నుంచి నల్లమడుగు సురేందర్‌, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్‌ నుంచి హన్మంత్‌ షిండేలకు మళ్లీ చాన్స్‌ ఇచ్చాడు అధినేత. నిజామాబాద్‌ రూరల్‌, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి ఈసారి తమ వారసులను బరిలోకి దింపాలని భావించారు బాజిరెడ్డి గోవర్దన్, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. కానీ అధినేత రిస్క్‌ తీసుకోలేదు. సిట్టింగులకే అప్పగించాడు ఈసారి కూడా. దీంతో వారసులకు నిరాశే ఎదురుకానున్నట్టు తెలుస్తోంది. సర్వత్రా ఉత్కంఠకు తెరతీస్తూ రేపు జంబో జాబితాను కేసీఆర్‌ స్వయంగా ప్రకటించనున్నారు. దాదాపు 90 శాతం అభ్యర్థులు సిట్టింగులే ఉండనున్నారు. మిగిలిపోయిన స్థానాలు శ్రావణ శుక్రవారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

You missed