ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మునుగోడు మంత్రం…

యాదాద్రి టూర్‌కు పంపుతున్న తరలుతున్న ఆర్మూర్‌ నాయకులు…

మచ్చర్ల నుంచి యాదాద్రి దైవదర్శనానికి బయలుదేరిన లీడర్లు…

ఆర్మూర్‌లో ప్రచారంలో జీవన్‌ దూకుడు… చేరికలు, సుడిగాలి పర్యటనలతో హడలెత్తిస్తున్న ఎమ్మెల్యే…

జీవన్‌రెడ్డి అంటే అంతే. ఎన్నికల్లో తనదైన శైలి. ప్రత్యర్థి ఎవరినేది కాదు. తనేం చేస్తున్నాడు అనేదే ముఖ్యం. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టే రకం. ఎవరొచ్చి ఏం అడిగినా… చేసేద్దాం దాందేముంది..? అంటే చాలా టూకీగా చెప్పేస్తాడు. తేలిగ్గా పనులు అయిపోయేలా అవసరమైతే అక్కడ్నుంచి హైదరాబాద్‌ పెద్దలతో మాట్లాడతాడు. పార్టీ కండువాలు కప్పేస్తాడు. ఇప్పటి వరకు తెచ్చిన పదివేల కుండువాలు మొన్నటితో అయిపోయాయట. అంతగా కప్పేశాడు కండువాలు అందరి మీద. ఇక తన మునుగోడు మంత్రాన్ని ఆర్మూర్‌లో ప్రయోగించేందుకు సిద్దమయ్యాడు.

మునుగోడు ఉప ఎన్నికలో తనకు ఇన్చార్జిగా ఇచ్చిన ఏరియా ఓటర్లకు తన సొంత ఖర్చులతో బస్సు ఏర్పాటు చేసి యాదాద్రి దైవ దర్శనానికి స్పెషల్‌ పర్మిషన్‌ తీసుకోవడం అప్పట్లో వివాదమైంది. రచ్చకెక్కింది. అయినా డోంట్‌ కేర్‌. అంతే మరి. ఓటర్లను ఆకర్శించాలంటే ఏమైనా చేయాలి. వారి మనసు దోచాలి. దైవ దర్శనానికి అన్ని ఖర్చులు పెట్టుకున్నాక… ఇక ఆ పార్టీకి కాక వేరే పార్టీ వైపు చూస్తారా..? ఇదీ పొలిటికల్ టెక్నిక్‌. రాజకీయ ఎత్తుగడ. పోల్‌ మేనేజ్‌మెంట్‌. అందులో మనోడు ఆరితేరాడు.

ఆర్మూర్‌ అంటేనే అంత. అందులోనా జీవన్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఎన్నికల మూడ్‌ వచ్చింది సరే. కానీ ఎక్కడా లేని విధంగా ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి ఇంకో నెలరోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయా..? అనే రీతిలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు.ఎవరికి ఏం కావాలి..? అడగగానే ఓకే అనేస్తున్నారు. ఇక పైగా ఇలా యాదాద్రి దైవదర్శనం అదనం. ఇది ఈ ఇప్పుడే ఆరంభమయ్యింది. ఇక ముందు ముందు మరిన్ని తన చేరికలు, హామీలు, యాత్రలు… ఎన్నో మరెన్నో ఉంటాయి. అవన్నీ చూసి మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రత్యర్థులు ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. జీవన్‌రెడ్డా..? మజాకా..??

You missed