ఆ(వే)ట మొదలయ్యింది…
బీజేపీ నేత అనుచరుడిని పార్టీలో చేర్చుకున్న జీవన్‌రెడ్డి…
రసకందాయంలో ఆర్మూర్ రాజకీయ౦….
ఆర్మూర్ అంటే అంతే. జీవన్‌రెడ్డి అంటే ఇంతే. ప్రత్యర్థి వర్గం ఊహించని స్టెప్పులు తీసుకుంటాడు. బలాన్ని బలహీనపరుస్తాడు. అదే తనబలంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. బీజేపీ నుంచి ఆర్మూర్ బరి నుంచి అంకాపూర్ వాసి పైడి రాకేశ్‌రెడ్డి నిలిచేందుకు ఇంకా కత్తులు, బల్లాలు సిద్దం చేసుకోకముందే … జీవన్‌రెడ్డి రాజకీయ ఆట షురూ చేశాడు. వేట మొదలుపెట్టాడు. బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి సొంత గ్రామం… అనుంగు అనుచరుడైన దేవెందర్‌రెడ్డిని బీఆరెస్ పార్టీలో చేర్చుకుని ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఇంకా రాకేశ్‌రెడ్డి జాయినింగ్స్ ఆట మొదలే పెట్టలేదు. అప్పుడే జీవన్ దీన్ని మొదలుపెట్టాడు. ఎవరైతే రాకేశ్‌కు దగ్గరగా ఉన్నారో వారికి గాలమేయడం మొదలు పెట్టాడు.
కుదిరితే రిక్వెస్టు.. కుదరకపోతే వార్నింగ్.. ఇదే సూత్రం జీవన్‌రెడ్డిది. ఇందులో ఏది ప్రయోగించాడో గానీ … ఇవాళ దేవేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటూ విడుదలైన వీడియో జిల్లా రాజకీయాల్లో వైరల్ అయ్యింది. ఆర్మూర్ ఆట మొదలయ్యింది. జీవన్‌రెడ్డి వేట షురూ అయ్యింది. ఇక రాకేశ్‌రెడ్డి దీన్ని ఎలా తట్టుకుంటాడో… తనను నమ్ముకుని పార్టీ మారి వచ్చే వాళ్లకు ఎలాంటి ధీమా ఇస్తాడో.. భరోసా నింపుతాడో… చూడాల్సి ఉంది. ఆర్మూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. అందరి దృష్టి అక్కడే ఉంది. అంతటి హైప్ పెంచుతున్నారీక్కడి నేతలు.