ఆర్మూర్‌ బీజేపీకి రాకేశ్‌ ఓకే… వాస్తవం చెప్పిందే నిజమైంది… అధిష్టానంతో భేటీ..
ఆర్మూర్‌- వాస్తవం: 
వాస్తవం మొదటి నుంచి చెప్తూ వచ్చిన వార్తే నిజమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేశ్‌రెడ్డి రాజకీయాల్లోకి రానున్నారని, బీజేపీలో చేరి ఆర్మూర్‌ నుంచి పోటీ చేస్తారని వాస్తవం కథనాలు అందించింది. నేడు అది నిజమైంది. రాకేశ్‌రెడ్డి మంగళవారం అధిష్టానాన్ని కలిసి తన రాజకీయ వేదికను సుస్థిరం చేసుకున్నారు. బీజేపీ పెద్దలు ఆయన ఆహ్వానాన్ని ఓకే చేసేశారు. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ను రాకేశ్‌రెడ్డి ఢిల్లీలో కలిసి రాజకీయ చర్చలు జరిపారు.
ఆర్మూర్‌ నుంచి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడం ఖరారైంది. పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. జూన్‌ 2న ఆయన పార్టీలో చేరాలనుకుంటున్నారు. తరుణ్‌చుగ్‌ను కలిసిన వారిలో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌, నైన్‌ స్టార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌, పైడి రాకేశ్‌రెడ్డి యువసేన అధ్యక్షురాలు పైడి సుచరితరెడ్డి, మల్లిఖార్జున్‌రెడ్డి తదితరులున్నారు.

You missed